12000 HP made in India locomotive

12000 HP made in India locomotive

భారత రైల్వే తన అత్యంత శక్తివంతమైన 12000 HP made in India locomotive ను పట్టాలు ఎక్కించింది.

ఈ లోకోమోటివ్ తో ప్రపంచంలో దేశీయంగా అధిక హార్స్‌పవర్ లోకోమోటివ్‌ను ఉత్పత్తి చేసిన దేశాలలో భారత్ 6 వ దేశంగా అవతరించింది.

ఈ ఘనత సాధించిన అతి తక్కువ దేశాల సరసన చేరింది. ఇది మన భారతీయ రైల్వేలకు అత్యంత గర్వకారణమైన విషయం.

ప్రపంచంలో బ్రాడ్‌గేజ్ ట్రాక్‌లో అధిక హార్స్‌పవర్ లోకోమోటివ్ ఉపయోగించడం ఇదే మొదటిసారి.

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ లోకోమోటివ్ ఉత్పత్తి చేయబడింది.

ఈ లోకోమోటివ్ 18.05.2020 తేదీన ఉత్తర్ ప్రదేశ్ లోని దీన్‌దయాల్ఉపాధ్యాయ జంక్షన్ నుండి బీహార్ లోని శివపూర్ వరకు తన తొలి వాణిజ్య పరుగును ప్రారంభించింది.

ఈ లోకోమోటివ్ ను మాధేపురా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ (MELPL) తయారు చేసింది.  లోకోమోటివ్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుండి పనిచేస్తుంది.

12000 HP Made in India Locomotive

ఇవి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ IGBT ఆధారిత, 3 ఫేజ్ డ్రైవ్ ద్వారా 12000 హార్స్‌పవర్ సామర్ధ్యం గల ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు.

ఈ అధిక హార్స్‌పవర్ లోకోమోటివ్‌లు సగటు వేగాన్ని మెరుగుపరచడంతో పాటు, సరుకు రవాణా రైళ్ల లోడింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ట్రాక్ సామర్ధ్యాన్ని బలోపేతం చేయనున్నాయి.

బీహార్‌లోని మాధేపురా ఎలక్ట్రిక్ లోకో ఫ్యాక్టరీ తయారుచేసిన 12000 HP Made in India Locomotive ఈ శ్రేణిలో మొట్టమొదటిది.

18-05-2020 తేదీన పిండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ నుండి భారత రైల్వే ఈ లోకోమోటివ్ ను ప్రారంభించింది.

చదవండి: Corona Cases in India Cross 1 Lakh Mark

మాధేపురా ఫ్యాక్టరీలో కొత్త డిజైన్ లోకోమోటివ్

ఈ లోకోకు 60027 నంబర్‌తో WAG12 అని పేరు పెట్టారు.

పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుండి 18-05-2020 తేదీన 14:08 గంటలకు ఈ రైలు బయలుదేరింది.

melpl workshop

ఇందులో 118 వ్యాగన్లు ఉన్నాయి, ఈ రైలు బీహార్ లోని డెహ్రీ-ఆన్-సోన్ ద్వారా ప్రయాణించి, ఝార్ఖండ్ లోని గర్హ్వారోడ్ మీదుగా బార్వాదిహ్ చేరనుంది.

దేశీయంగా అధిక హార్స్‌పవర్ లోకోమోటివ్‌ను ఉత్పత్తి చేసే ఎలైట్ క్లబ్‌లో చేరిన 6వ దేశంగా అవతరించడం భారతీయ రైల్వేకు గర్వకారణం.

ప్రపంచంలో బ్రాడ్‌గేజ్ ట్రాక్‌లో అధిక హార్స్‌పవర్ లోకోమోటివ్ పనిచేయడం ఇదే మొదటిసారి. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కింద ఈ లోకోమోటివ్ ఉత్పత్తి చేయబడింది.

మాధేపురా కర్మాగారం 120 లోకోమోటివ్ల ఉత్పత్తి సామర్థ్యంతో నాణ్యత మరియు భద్రత యొక్క అత్యున్నత ప్రమాణాలతో 250 ఎకరాలలో విస్తరించిన అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్ధాపన.

Join us on Telegram

లోకోమోటివ్ శక్తి సామర్ధ్యాలు

Alstom-workshop

ఈ లోకోమోటివ్‌లు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఐజిబిటి బేస్డ్, 3 ఫేజ్ డ్రైవ్, 9000 కిలోవాట్ (12000 హార్స్‌పవర్) ఎలక్ట్రిక్ లోకోమోటివ్.

ఈ లోకోమోటివ్ 706 kN గరిష్ట సామర్థ్యంతో పనిచేయగలదు, ఈ శక్తితో 6000 టన్నుల రైలును ఈ లోకోమోటివ్ లాగగలదు.

22.5 టన్నుల ఇరుసు సామర్థ్యం కలిగిన జంట బో-బో డిజైన్‌తో ఈ లోకోమోటివ్ తయారుచేయబడింది.

25 టన్నుల ఇరుసుకు పెంచడం ద్వారా 120 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు.

సరుకు రవాణా ముఖచిత్రాన్ని ఈ లోకోమోటివ్ మార్చనుంది.

చదవండి: Bharat Ratna Awards Complete Information

Alstom-Electric-Loco-shell

జి.పి.ఎస్. తో ట్రాకింగ్

మెరుగైన ఉపయోగం కోసం ఈ లోకోమొటివ్ లో ఉన్న ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఈ లోకోమోటివ్‌లను జిపిఎస్ ద్వారా ట్రాక్ చేయవచ్చు.

దీనికి అంతర్గతంగా అమర్చిన యాంటెన్నాల నుండి ఇది మైక్రోవేవ్ లింక్ ద్వారా నియంత్రణా కేంద్రాలలో ఉన్న సర్వర్‌లకు అనుసంధానం చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుంది.

Alstom-Electric-Loco-body-shell-at-workshop

లోకోమోటివ్ సాంప్రదాయ OHE లైన్లతో పాటు ఫ్రైట్ కోసం ప్రత్యేకించిన కారిడార్‌లలో ఎత్తైన OHE లైన్లపై కూడా పని చేయగలదు.

లోకోమోటివ్‌లో ఇరువైపులా ఎయిర్ కండిషన్డ్ డ్రైవర్ క్యాబిన్లు ఉన్నాయి.

పునరుత్పాద బ్రేకింగ్ వ్యవస్థతో అమర్చబడి ఉండటం వలన, ఇది ఇంధన(విద్యుత్) వినియోగంలో గణనీయమైన పొదుపును అందిస్తుంది.

ఈ అధిక హార్స్‌పవర్ లోకోమోటివ్‌లు సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని మెరుగుపరచడం ద్వారా ట్రాక్‌ పై రద్దీని తగ్గిస్తూ సమర్ధవంతంగా పనిచేయగలదు.

మాధేపురా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ (MELPL) రాబోయే 11 సంవత్సరాలలో 800 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ 12000 HP made in India Locomotives తయారు చేయనుంది.

Alstom-Electric-Loco-body-shell

Join us on Facebook

మారనున్న సరుకు రవాణా ముఖచిత్రం

ప్రపంచంలో అత్యంత శక్తితో కూడిన పూర్తి-ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లలో ఒకటిగా ఉండటం వల్ల సరుకు రవాణా రైళ్ల వేగం పెరుగుతుంది.

ఇది దేశవ్యాప్తంగా వేగంగా, సురక్షితమైన మరియు భారీ సరుకు రవాణా రైళ్లను తరలించడానికి ఉపకరిస్తుంది, తద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.

ఇది పునరుత్పత్తి బ్రేకింగ్ ద్వారా శక్తి వినియోగంలో గణనీయమైన పొదుపుకు దారితీస్తుంది.

Alstom-Electric-Loco

Also Read: PM Narendra Modi Announces INR 20 Lakh Crore Package

ఉపాధితో పాటు సామాజిక బాధ్యత

ఈ ప్రాజెక్టులో భాగంగా బీహార్‌లోని మాధేపురాలో సంవత్సరానికి 120 లోకోమోటివ్లను తయారు చేసే సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీతో పాటు ఒక టౌన్‌షిప్‌ను(ఆవాసం) కూడా ఏర్పాటు చేశారు.

ఈ ప్రాజెక్టు దేశంలో 10,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే రూ. 2000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు.

కర్మాగారంతో పాటు, మాధేపురాలో సామాజిక-ఆర్థిక అభివృద్ధి ఈ ప్రాజెక్టు ద్వారా సాగుతుంది.

CSRలో భాగంగా స్థానిక ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి మాధేపురాలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

భారత రైల్వే మాధేపురా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్‌(MELPL)తో ప్రొక్యూర్‌మెంట్ కమ్ మెయింటెనెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.

12000 hp locomotive

దేశంలోని భారీ సరుకు రవాణా ముఖచిత్రాన్ని మార్చడానికి భారత రైల్వే యొక్క అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రాజెక్టులో భాగంగా ఈ ఒప్పందం జరిగింది.

ఇది ఇండియా రైల్వే (ఐఆర్) రూపొందించిన ‘మేక్ ఇన్ ఇండియా’ ఇనిషియేటివ్.

చదవండి: Bois Locker Room Case: సామాజిక మాధ్యమంలో ఓ చీకటి గది

అడ్డంకుల్లన్నింటిని ఛేదిస్తూ నిలిచిన Made In India Locomotive

భారత ప్రధానమంత్రి ఈ ప్రాజెక్టును ఏప్రిల్ 10, 2018 న ప్రారంభించారు.

ఈ లోకోమోటివ్ నమూనా మార్చి 2018 లో చేయబడింది. పరీక్ష ఫలితాల్లో గుర్తించబడిన డిజైన్ సమస్యలను పరిష్కరిస్తూ బోగీలతో సహా పూర్తి లోకోమోటివ్ పునఃరూపకల్పన చేయబడింది.

లోకోమోటివ్ యొక్క కొత్త డిజైన్‌ను మాధేపురా ఫ్యాక్టరీలో RDSO తనిఖీ చేసి, నవంబర్ 16, 2019 న ఫ్యాక్టరీ నుండి పంపించడానికి అనువతి జారీ చేసింది.

RDSO 132 కిలోమీటర్ల వరకూ వివిధ వేగాల వద్ద ఈ లోకోమోటివ్ పై పరీక్షలను నిర్వహించగా అన్ని పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకుంది ఈ లోకోమోటివ్.

ఈ లోకోమోటివ్ 18.05.2020 న దీన్‌దయాల్ఉపాధ్యాయ స్టేషన్ నుండి శివపూర్ మధ్య తన తొలి వాణిజ్య పరుగును పూర్తి చేసింది.

దీని డిజైన్ నాలుగు నుంచి ఆరు నెలల రికార్డు సమయంలో పూర్తయింది.

ఆరంభంలో ఎదురైన బాలారిష్టాలకు తోడు COVID-19 మహమ్మారి సమస్య ఎదురైనప్పటికి, ఇది భారతీయ రైల్వే స్ఫూర్తితో ఈ ఘనత సాధ్యమైంది.

మాధేపురా ఫ్యాక్టరీలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ప్రాజెక్ట్ను తిరిగి గాడిన పడవేయడానికి గల అన్ని అవరోధాలను అధిగమించి బీహార్ ప్రభుత్వ అనుమతి పొందగలిగింది.

Join us on Twitter