Corona Cases in India Cross 1 Lakh Mark

corona cases in india cross 1 lakh mark లక్ష మార్కు దాటిన కరోనా కేసులు

ఈ శీర్షిక వినండి:

Corona cases in india cross 1 lakh mark: లాక్డౌన్లో ఇప్పటికి ఎనిమిది వారాలు గడచిపోయాయి. గత 24 గంటల్లో 4,970 కొత్త కేసులు నమోదు కావడంతో భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య ఒక లక్ష మార్కు దాటింది.

19 మే2020 ఉదయం 8గంటల సమయానికి మొత్తం కేసుల సంఖ్య 1,01,139 కు చేరుకుంది. ఇప్పటివరకు COVID-19 వల్ల 3,163 మరణాల సంభవించగా, గడిచిన 24 గంటల్లో 134 మరణాలు సంభవించాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం 39,173 మంది రోగులు కోలుకున్నారు. వీటితో ప్రస్తుతం 58802 కేసులు యాక్టివ్ గా ఉన్నవి.

చైనా యొక్క వుహాన్ నగరంలో ఉద్భవించిన మహమ్మారి నుండి రక్షణగా మార్చిలో ప్రభుత్వం ప్రకటించిన దేశవ్యాప్త లాక్డౌన్, ప్రస్తుతం నాల్గవ దశలో సడలించబడింది.

చదవండి: Bharat Ratna Awards Complete Information

కుదేలైన ఆర్ధిక వ్యవస్థ

ప్రజా రవాణా – బస్సులు మరియు ఆటోలతో సహా – ఢిల్లీ, బెంగళూరు మరియు హైదరాబాద్ సహా పలు ప్రధాన నగరాల్లో నడపడానికి అనుమతించబడుతుంది.

ఈ మహమ్మారి పంజాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై ప్రభుత్వం దృష్టి సారించడంతో పరిమితులలో సడలింపులపై దృష్టి సారించింది కేంద్రం.

భారతదేశంలో ఇప్పటివరకు ప్రతీ లక్ష మందికి 7.1 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం(18-మే-2020) తెలిపింది.

ఇప్పటివరకు తీసుకున్న ముందస్తు చర్యలు ఖటినంగా ఉన్నప్పటికీ ప్రోత్సాహకరమైన ఫలితాలను చూపించాయి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

కరోనా కేసులు సంఖ్య ఒక లక్ష మార్కు దాటిన ఈ తరుణంలో, కోరోనా మహమ్మారిపై పోరాడటానికి భారతదేశం అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ సోమవారం అన్నారు.

Join us on Telegram

ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాలి

73వ ప్రపంచ ఆరోగ్య సభలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హర్ష్ వర్ధన్ ప్రసంగిస్తూ, ప్రస్తుతం నెలకొన్న గడ్డు పరిస్థితులలో ప్రపంచ దేశాల సహకారం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

ప్రభుత్వాలు, పరిశ్రమలు, సేవా తత్పరులు కలిసికట్టుగా పని చేయవలసిన తరుణంగా ఆయన పేర్కొన్నారు.

ఈ గడ్డుకాలంలో పరిశోధన, తయారీ మరియు పంపిణీ కోసం అన్ని దేశాలు కలసికట్టుగా వనరులను సమకూర్చుకొని, ఫలితాలు ఎక్కడ అభివృద్ధి చెందినా వాటి ఫలాలు అందరికీ అందాలి అన్నారు.

కేంద్రం సవరించిన కరోనావైరస్ పరీక్షా వ్యూహాన్ని ప్రకటిస్తూ, వలస వచ్చిన వారందరూ ఇంటికి చేరుకున్న ఏడు రోజుల్లో పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.

అంటువ్యాధికి వ్యతిరేకంగా పోరాటంలో నోడల్ బాడీ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సవరించిన మార్గదర్శకాలు ప్రకటించినది.

ఆ మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు వెంటనే వైద్య సహాయం అందించాలని ఐసిఎంఆర్ పిలుపునిచ్చింది.

మార్చిలో లాక్డౌన్ ప్రకటనతో లక్షలాది మంది వలసదారులు ఎక్కడి వారు అక్కడ చిక్కుకుపోయారు. వారిలో చాలామంది ఇప్పటికీ వారి సొంత ఊళ్ళకు చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నారు.

చదవండి : భారత జీ.డీ.పీ. పయనం ఎటువైపు?

మహరాష్ట్రలో ప్రళయ తాండవం చేస్తున్న కరోనా

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,033 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, మొత్తం 35,000 మార్కులను దాటింది. దీనితో కరోనా మహమ్మారి వల్ల అత్యధికంగా దెబ్బతిన్న రాష్ట్రంగా మహరాష్ట్ర నిలిచింది.

మహారాష్ట్ర ఆంక్షలను సడలించదు అని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సోమవారం అన్నారు.

లాక్డౌన్ ఎత్తివేయడం వల్ల ఈ మహమ్మారి ప్రతిచోటా వ్యాప్తి చెందుతుందని, మహారాష్ట్రలో అలా జరగనివ్వను అని అన్నారు ఉద్దవ్.

లాక్డౌన్ కారణంగా, కేసుల పెరుగుదలను నియంత్రించగలిగినట్లుగా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని విచ్ఛిన్నం చేయలేకపోయినప్పటికి ఆ దిశగా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.

కొత్తగా 200 మందికి పైగా రోగులతో ఢిల్లీ సోమవారం కరోనావైరస్ కేసుల సంఖ్య 10,000 మార్కును దాటింది.

చదవండి: PM Narendra Modi Announces INR 20 Lakh Crore Package

corona cases in india cross 1 lakh mark ఇటు కరోనా అటు తుఫాను

దేశం కరోనావైరస్‌తో పోరాడుతుండగా, బెంగాల్ మరియు ఒడిశా అనే రెండు రాష్ట్రాలు అమ్ఫాన్ తుఫాను హెచ్చరికలతో అప్రమత్తం అయ్యాయి.

ఇది ఈరోజు బెంగాల్‌ను తాకవచ్చు. దీనిపై ప్రధాని మోదీ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొదట్లో ఊహించిన దానికంటే ఈ కరోనావైరస్ వల్ల కలిగే నష్టం నుండి పూర్తిగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి పేర్కొంది.

ప్రస్తుతం నెలకొన్న ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఎంతైనా అవసరం.

వాణిజ్య కార్య కలాపలను, ముఖ్యంగా వైద్య సామాగ్రి, మరియు ఆహార సరఫరాలను కొనసాగించవలసిన అవసరముందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అధిపతి క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు.

భారత్ లో కరోనా కేసులు సంఖ్య ఒక లక్ష మార్కు దాటిన వేళ (When corona virus cross 1 lakh mark) ప్రపంచవ్యాప్తంగా, COVID-19 బారిన పడిన వారి సంఖ్య ఐదు మిలియన్ల మార్కుకు దగ్గరగా ఉంది.

48 లక్షలకు పైగా ఈ వ్యాధి వల్ల ప్రభావితమయ్యారు, 3 లక్షలకు పైగా మరణించారు.

Join us on Facebook