Bharat Ratna Awards Complete Information

Bharat Ratna Awards

Bharat Ratna Awards Complete Information భారతరత్న పురస్కారాలపై సమగ్ర సమాచారం

ప్రతీ దేశంలో పౌరులు దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా అత్యుత్తమమైన పురస్కారాన్ని ఇచ్చి ఆ దేశాలు గౌరవిస్తాయి.  Bharat Ratna Awards Complete Information భారతరత్న పురస్కారాలపై సమగ్ర సమాచారం ఈ సీర్షికలో తెలుసుకుందాం.

భారతదేశంలో అత్యుత్తమమైన పౌర పురస్కారం భారతరత్న. ఈ అవార్డును భారత ప్రభుత్వం ఇస్తుంది. భారతరత్న పురస్కారాన్ని మొదటిసారిగా 1954 జనవరి 2వ తేదీన భారతదేశ తొలి రాష్ట్రపతి  డా. రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.

కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకు కూడా ఈ పురస్కారాలను ఇచ్చి గౌరవించడం జరుగుతుంది.

1954 సం.లోని నిబంధనల ప్రకారం మరణించిన వారికి ఈ పురస్కారం ఇవ్వరాదని సూచిస్తున్నాయి.

కానీ 1955 లో ఈ నిబంధనలను సవరించి, మొట్టమొదటి సారిగా 1966లో లాల్ బహదూర్ శాస్త్రికి మరణానంతరం భారతరత్న పురస్కార ప్రధానం జరిగింది.

ఈ పురస్కారన్ని మొదట సాహిత్యం, కళలు, విజ్ఞానం, ప్రజాసేవా రంగాలలో మాత్రమే ప్రధానం చేశారు.

దీనిని సవరిస్తూ 2011లో అప్పటి ప్రభుత్వం మొదటిసారిగా క్రీడారంగంతో సహా ఏ రంగంలో వారికైనా భారతరత్న పురస్కారాన్ని ఇవ్వడానికి వీలు కల్పించింది.

Also Read: PM Narendra Modi Announces INR 20 Lakh Crore Package

భారతరత్న గూర్చి రాజ్యాంగంలో ప్రస్తావన

ఈ అవార్డు గురించి రాజ్యాంగంలో 18వ అధికరణలో వివరించబడింది.

దీనిని భారత గణతంత్ర దినోత్సవం అయిన జనవరి 26న ప్రధానం చేస్తారు. ప్రధానమంత్రి సిఫారసు మేరకు ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి అందిస్తారు.

నిబంధనల ప్రకారం భారతరత్న ఒక గౌరవ పురస్కారం మాత్రమే దీనిని పేరుకు ముందు గానీ, పేరు తరువాత గాని బిరుదుగా ఉపయోగించరాదు.

1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రద్దు భారతరత్న పురస్కారాన్ని రద్దు చేయగా, 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం దీనిని పునరుద్ధరించడం జరిగింది.

భారతరత్న పునఃప్రారంభించిన తరువాత పొందిన మొదటి వ్యక్తి మదర్ థెరీసా(1980).

Subscribe to us on YouTube

పరస్కారాల తయారి

భారతరత్న పురస్కారాన్ని కాంస్యంతో రూపొందిస్తారు. దీని ఆకారం రావి ఆకును పోలి ఉంటుంది.

ఆకు మథ్యభాగంలో ప్రాకాశిస్తున్న సూర్యుడు ఉండగా, దాని క్రింద దేవనాగరి లిపిలో భారతరత్న అని వ్రాసి ఉంటుంది.

ఈ పురస్కారం వెనకవైపు ప్లాటినంతో భారత జాతీయ చిహ్నమైన ముడు సింహాల గుర్తు ఉండి దాని క్రింద దేవనాగరి లిపిలో సత్యమేవజయతే అని ఉంటుంది.

కలకత్తాలోని అలిపూర ప్రభుత్వ ముద్రణాలయంలో ఈ భారతరత్న పతకాలను రూపొందిస్తారు.

భారతరత్నను 1954 నుండి 2019 వరకు 49 మందికి ప్రకటించినప్పటికి ఇప్పటి వరకు 48 మందికి ప్రధానం చేయడం జరిగింది.

1992లో సుభాష్ చంద్రపోస్ కి ప్రకటించినప్పటికి ఆయన కుటుంబ సభ్యులు స్వీకరించలేదు.

ఇప్పటి వరకు భారత రత్న పురస్కారాలు పొందిని వ్యక్తుల వివరాలు.

1954 –

1955 –

1957 –

1958 –

1961 –

1962 –

1963 –

1966 –

1971 –

1975 –

1976 –

1980 –

1983 –

1987 –

1988 –

1990 –

1991 –

1992 –

1997 –

1998 –

1999 –

2001 –

2008 –

2014 –

2015 –

2019 –

సి. రాజగోపాలచారి

సర్వేపల్లి రాధాకృష్ణన్

సి. వి. రామన్

జవహర్ లాల్ నెహ్రు

భగవాన్ దాస్

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

గోవింద్ వల్లభ్ పంత్

డోండో కేశవ్ కార్వే (డి.కే.కార్వే)

బి.సి.రాయ్

పురుషోత్తమ దాస్ టండన్

బాబూ రాజేంద్ర ప్రసాద్

జారీర్ హుస్సేన్

పి.వి. కానే

లాల్ బహదూర్ శాస్త్రి

ఇందిరా గాంధి

వి.వి.గిరి

కే. కామరాజ్ నాడార్

మదర్ ధెరిసా

ఆచార్య వివోభా బావే

ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్

ఎం.జి. రామచంద్రన్

నెల్సన్ మండేలా

రాజీవ్ గాంధి

సర్దార్ వల్లభాయ్ పటేల్

మొరార్జీ దేశాయ్

జే. ఆర్. డి. టాటా

మౌలానా అబుల్ కలాం ఆజాద్

సత్యజిత్ రే

గుల్జారీ లాల్ నందా

అరుణ ఆసఫ్ అలి

ఏ.పి.జే. అబ్దుల్ కలాం

ఎం.ఎస్. సుబ్బలక్ష్మి

సి. సుబ్రమణ్యం

జయప్రకాష్ రాయణ్

అమార్త్యసేన్

పండిట్ రవిశంకర్

గోపీనాధ్ బార్దోలోయ్

ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్

లతా మంగేష్కర్

పండిత్ భీంసేన్ జోషి

చింతామణి నాగేశ రామచంద్ర రావు

సచిన్ టెండూల్కర్

మదన్ మోహన్ మాలవ్య

అటల్ బిహారీ వాజ్‌పేయి

ప్రణబ్ ముఖర్జీ

భూపేన్ హజారికా

నానాజీ దేశ్ముఖ్

– తమిళనాడు

– తమిళనాడు

– తమిళనాడు

– ఉత్తర్ ప్రదేశ్

– ఉత్తర్ ప్రదేశ్

– కర్ణాటక

– ఉత్తర్ ప్రదేశ్

– మహరాష్ట్ర

– పశ్చిమ బెంగాల్

– ఉత్తర్ ప్రదేశ్

– బీహార్

– ఉత్తర్ ప్రదేశ్

– మహరాష్ట్ర

– ఉత్తర్ ప్రదేశ్

– ఉత్తర్ ప్రదేశ్

– ఒరిశా

– తమిళనాడు

– పశ్చిమ బెంగాల్

– మహరాష్ట్ర

– పాకిస్థాన్

– తమిళనాడు

– దక్షిణ ఆఫ్రికా

– ఉత్తర్ ప్రదేశ్

– గుజరాత్

– గుజరాత్

– మహరాష్ట్ర

– పశ్చిమ బెంగాల్

– పశ్చిమ బెంగాల్

– పంజాబ్

– పశ్చిమ బెంగాల్

– తమిళనాడు

– తమిళనాడు

– తమిళనాడు

– బీహార్

– పశ్చిమబెంగాల్

– పశ్చిమబెంగాల్

– అస్సాం

– బీహార్

– మహరాష్ట్ర

– కర్ణాటక

– కర్ణాటక

– మహారాష్ట్ర

– ఉత్తర్ ప్రదేశ్

– మధ్యప్రదేశ్

– పశ్చిమ బెంగాల్

– అస్సాం

– మహరాష్ట్ర

Join us on Telegram

భారతరత్న గురించిన కొన్ని ముఖ్యాంశాలు. Important Points about Bharat Ratna Awards

1954 సంవత్సరానికి గాను భారతరత్న ముగ్గురు వ్యక్తులకు ప్రధానం చేయ్యడం జరిగింది.

వారు:

 1. సి. రాజగోపాలాచారి
 2. సర్వేపల్లి రాధాకృష్ణ
 3. సి.వి.రామన్

ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి చక్రవర్తి రాజగోపాలచారి 1954. ఈయన స్వతంత్ర భారతదేశ ఏకైక(తొలి మరియు చివరి) గవర్నర్ జన్రల్.

భారతరత్న పొందిన తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ (1954 లో)

నోబెల్ పురస్కారం మరియు భారతరత్న పొందిన మొదటి వ్యక్తి సి.వి.రామన్

భారతరత్న పొందిన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు (1955).

ఈ పురస్కారం పొందిన అతి పెద్ద వయస్కుడు డి.కే.కార్వే 100 సంవత్సరాల వయసులో.

భారతరత్న పొందిన తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ (1966)

మరణానంతరం ఈ పురస్కారన్ని పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి

భారతరత్న పొందిన అతి పిన్న వయస్కుడు సచిన్ టెండుల్కర్ 40 సంవత్సరాల వయసులో.

క్రీడారంగం నుండి భారతరత్న పొందిన తొలి వ్యక్తి సచిన్ టెండూల్కర్.

భారతరత్న పొందిన తొలి మహిళ ఇందిరాగాంధీ (1981)

మరణాంతరం భారతరత్న పొందిన తొలి మహిళ అరణా ఆసిఫ్ అలి(1997)

భారతరత్న పొందిన తొలి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ – పాకిస్థాన్(1987), ఈయనను సరిహద్దు గాంధీగా పిలుస్తారు.

ఈ పురస్కారం పొందిన రెండవ విదేశీయుడు నెల్సన్ మండేలా(1990)

సినీ రంగం నుండి ఈ పురస్కారన్ని అందుకున్న తొలి వ్యక్తి ఎం.జీ. రామచంద్రన్(1988)

సినీ దర్శకులలో ఈ పురస్కారం పొందిన తొలి వ్యక్తి సత్యజిత్ రే (1992)

చదవండి: LG Polymers Vizag Gas Leakage: A tragedy

భారతరత్న పొందిన శాస్త్రవేత్తలు
 1. సి.వి.రామన్ 1954
 2. ఏ.పి.జే. అబ్దుల్ కలాం 1997
 3. చింతామణి నాగేశ రామచంద్ర రావు 2014
మహిళల్లో భారతరత్న పొందిన వారు
 1. ఇందిరా గాంధీ
 2. మదర్ ధెరీసా
 3. అరుణా ఆసిఫ్ అలీ
 4. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి
 5. లతా మంగేశ్కర్

అత్యధికంగా నలుగురికి భారతరత్న పురస్కారాన్ని ప్రధానం చేసిన సంవత్సరం 1999

భారతరత్న పురస్కార గ్రహీతలు అత్యధికంగా గల రాష్ట్రం తమిళనాడు.