National Water Mission – జాతీయ నీటి మిషన్

National Water Mission – జాతీయ నీటి మిషన్

గ్లోబల్ వార్మింగ్ వల్ల పొంచివున్న సవాళ్ళను పరిష్కరించడానికి రూపొందించిన వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికలోని ఎనిమిది మిషన్లలో నేషనల్ వాటర్ మిషన్ (National Water Mission) ఒకటి.

ప్రతి సంవత్సరం తలసరి నీటి లభ్యత తగ్గడం, భూగర్భజలాలు తగ్గడం, దీర్ఘకాలిక కరువులు, అధిక వర్షాల కారణంగా వరదలు; నీటి సంరక్షణ మరియు నిల్వ ప్రతి దేశానికి ఆందోళన కలిగిస్తున్న అంశాలు.

భారత్ లో ఈ పరిస్థితులను అధిగమించడానికి 2011 లో నేషనల్ వాటర్ మిషన్ ప్రారంభించబడింది.

Join Us on Telegram

ప్రధాన లక్ష్యం మరియు నేపధ్యం

National Water Mission నేషనల్ వాటర్ మిషన్ (NWM) యొక్క ప్రధాన లక్ష్యం “నీటి సంరక్షణ, వ్యర్థాలను తగ్గించడం, సమగ్ర నీటి వనరుల అభివృద్ధి మరియు నిర్వహణ ద్వారా రాష్ట్రా మరియు అంతర్రాష్ట్ర స్థాయిలో నీటి పంపిణీ సమర్ధవంతంగా నిర్వహించడం”.

ఈ మిషన్ యొక్క ఐదు ప్రధాన లక్ష్యాలు:

  1. సమగ్ర నీటి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం మరియు నీటి వనరులపై వాతావరణ మార్పుల (Climate Change) ప్రభావాన్ని అంచనా వేయడం;
  2. నీటి పరిరక్షణ, వృద్ధి మరియు నీటి వనరులను బలోపేతం చేసేందుకు పౌరులను, రాష్ట్రాలను ప్రోత్సహించడం;
  3. అధికంగా నీటి దుర్వినియోగానికి గురైన ప్రాంతాలు మరియు నీటి కొరత ఉద్భవించే ప్రాంతాలపై దృష్టి పెట్టడం;
  4. నీటి వినియోగ సామర్థ్యాన్ని 20% మేర పెంచడం, మరియు
  5. పరీవాహక ప్రాంత స్థాయి సమీకృత జల వనరుల నిర్వహణను ప్రోత్సహించడం.

చదవండి: Easing Liquidity at NBFCs and HFCs

NATIONAL WATER MISSION

ఈ లక్ష్యాలను సాధించడానికి వివిధ వ్యూహాలను గుర్తించారు.

విశ్వసనీయ సమాచారం ఆధారంగా నీటి వనరులపై వాతావరణ మార్పుల ప్రభావాలను అంచనా వేయడం.

తద్వారా మెరుగైన ఆమోదయోగ్యత వైపు అభివృద్ధి దృష్టాంతాన్ని మరియు నిర్వహణ పద్ధతులను గుర్తించడం.

రాష్ట్రాలు మరియు ఇతర సంబంధిత సంస్థల చురుకైన భాగస్వామ్యంతో స్థిరమైన అభివృద్ధి మరియు సమర్థవంతమైన నిర్వహణ కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించడం.

వర్షపాతంలో ప్రాదేశిక వైవిధ్యం కారణంగా నదీ ప్రవాహం మరియు భూగర్భ జలచరాలలో సాపేక్ష వైవిధ్యం భారతదేశంలోని నీటి వనరులలో ముఖ్యమైన లక్షణం.

నీటి వనరులపై వాతావరణ మార్పుల ప్రభావం ఖచ్చితంగా నిరూపించబడలేదు.

ఐనప్పటికీ, వివిధ అధ్యయనాలు నీటి వనరులపై వాతావరణ మార్పుల ప్రభావం విపత్కర సంఘటనలలో మరింత నీటి యద్దడిని తీవ్రతరం చేయడానికి దోహదం చేస్తుందని సూచిస్తున్నాయి.

అంతేగాక, నీటి లభ్యత మరియు నాణ్యత రెండూ కూడా పట్టణీకరణ, పారిశ్రామికీకరణ మరియు అటవీ విస్తీర్ణంలో మార్పుల ద్వారా గణనీయంగా ప్రభావితమవుతాయి.

నీటి కాలచక్రాన్ని ప్రభావితం చేసే వివిధ ప్రక్రియలు అస్థిర స్వభావం కలిగి ఉంటాయి.

వాతావరణ మార్పుల వల్ల నీటి కాలచక్రంపై కలిగే ప్రభావాన్ని ఖచ్చితంగా అంచనావేయడం సులువైన విషయం కాదు.

Follow us on Facebook

ప్రారంభ దశలలో కొంతమేర అంచనాలతో ఆరంభించినా కాలానుగుణంగా అందే సమాచారాన్ని అనుసంధానించుకుంటూ అనుకరణ అధ్యయనాలను చేపట్టవలసి ఉంటుంది.

ఏదేమైనా, నీటి వనరులపై వాతావరణ మార్పుల ప్రభావం ఈ విధంగా ఉండనుంది:

  • హిమాలయాలలో హిమానీనదాలు మరియు మంచు క్షేత్రాలలో క్షీణత కనిపించనుంది.
  • దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షపు రోజుల సంఖ్య మొత్తం తగ్గడం వల్ల కరువు వంటి పరిస్థితులు పెరుగతాయి.
  • వర్షం కురిసే తీవ్రత మొత్తం పెరగడం వల్ల వరద సంఘటనలు పెరిగనున్నాయి.
  • పెరిగిన వరద మరియు కరువు సంఘటనల కారణంగా ఒండ్రు జలాశయాలలో భూగర్భజల నాణ్యతపై ప్రభావం ఉంటుంది.
  • అవపాతం మరియు బాష్పీభవనంలో మార్పులు భూగర్భజల పునరుద్ధరణపై ప్రభావం చూపుతాయి.
  • సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీరప్రాంత మరియు ద్వీప జలాశయాలలో ఉప్పునీటి చొరబాటు పెరిగింది.

Also Read: Bharat Ratna Awards Complete Information

ఇలాంటి పరిస్థితుల్లో, నీటి వనరులపై వాతావరణ మార్పుల ప్రభావం ఉన్న సందర్భంలో, భారతదేశంలో అత్యంత నీటియద్దడిని చూడనున్న ప్రాంతాలు

  • కరువు పీడిత ప్రాంతాలు
  • వరద పీడిత ప్రాంతాలు
  • తీర ప్రాంతాలు
  • తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం
  • భూగర్భ జలాలు అధికంగా వృధాకు గురౌతూ భూగర్భజలాల పునరుత్పాదన క్లస్టతర దశలో ఉన్న ప్రాంతాలు
  • నీటి నాణ్యత ప్రభావిత ప్రాంతాలు, మరియు
  • మంచుతో నిండిన నదీ పరీవాహక ప్రాంతాలు.

National Water Mission నేషనల్ వాటర్ మిషన్ యొక్క లక్ష్యాలను సాధించడానికి, గుర్తించిన కార్యకలాపాలను సమయానుసారంగా పూర్తి చేయాలి.

అంతేగాక విధానాల అమలుకు వివిధ స్థాయిలలో రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం ద్వారా అవసరమైన చట్టాలను అమలు చేయడం వంటి దీర్ఘకాలిక వ్యూహాలు కూడా ఎంతో అవసరం.

Subscribe to us on YouTube