CHENNAI – ANDAMAN NICOBAR ISLANDS SUBMARINE CONNECTIVITY

CHENNAI – ANDAMAN NICOBAR ISLANDS(CANI) SUBMARINE CONNECTIVITY

CHENNAI – ANDAMAN NICOBAR ISLANDS SUBMARINE CONNECTIVITY అండమాన్ & నికోబార్ దీవులను ప్రధాన భూమితో కలిపే చెన్నై – అండమాన్ నికోబార్ దీవులు (CANI) సబ్ మరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీని 10 ఆగస్టు 2020న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ మోదీ ప్రారంభించారు.

ఈ పరియోజనకు పోర్ట్ బ్లేయర్లో 2018 డిసెంబర్ 30వ తేదీన మోదీ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రాధాని మోదీ ప్రస్ధావించిన కొన్ని కీలక అంశాలు:

2300 కి.మీ. సబ్ మరీన్ కేబుల్ ద్వారా ఈ సంధానం అండమాన్ మరియు నికోబార్ దీవులలో అవకాశాలను ప్రోత్సహించగలదు.

చెన్నై నుండి పోర్ట్ బ్లేయర్ వరకు, పోర్ట్ బ్లేయర్ నుండి లిటిల్ అండమాన్, మరియు పోర్ట్ బ్లేయర్ నుండి స్వరాజ్ ఐలండ్ వరకు గల దీవులలో ఒక చాలా పెద్ద భాగంలో ఈ సేవలు ప్రారంభం అయ్యాయి.

వ్యాపారంలో సౌలభ్యాన్ని ప్రోత్సహించడం, ఇంకా సముద్ర సంబంధ లాజిస్టిక్స్ ను సరళతరంగా మార్చడంపై ప్రభుత్వం శ్రద్ద వహిస్తోంది.

నౌకాశ్రయాల నాయకత్వంలో అభివృద్ధికి నిలయంగా ఉన్నతిని సాధించనున్న అండమాన్ & నికోబార్ దీవులు.

అంతర్జాతీయ సముద్ర సంబంధ వర్తకానికి ఒక ప్రధాన కేంద్రంగా ఎదగనున్న అండమాన్ & నికోబార్ దీవులు.

సముద్రంలోని లోతట్టు ప్రాంతంలో సర్వేక్షణను చేపట్టడం, కేబుల్ యొక్క నాణ్యతను పరిరక్షించడం మరియు స్పెశలైజ్డ్ వెసల్స్ తో కేబుల్ ను వేయడం వంటి కార్యభారాలు ఏమంత సులువైనవి కావు.

అందువల్ల సముద్రంలో దాదాపు 2300 కిలోమీటర్ల దిగువన Chennai – Andaman & Nicobar Islands(CANI) submarine connectivity కేబుల్స్ ను వేయడాన్ని మెచ్చుకోవలసిందే అని ప్రధాన మంత్రి అన్నారు.

ఉవ్వెత్తున ఎగసిపడే అలలు, తుఫానులు మరియు ఋతుపవనాల వంటి సవాళ్లను అధిగమించవలసి ఉంటుందని, కరోనా విశ్వమారి నేపథ్యంలో కష్ట కాలాలు ఎదురయ్యాయని ఆయన అన్నారు.

Join us on Telegram

submarine Optical-Fiber

సుదీర్ఘ కల సాకారం

అండమాన్ & నికోబార్ దీవులకు చాలా సంవత్సరాలుగా దీని యొక్క ఆవశ్యకతను గమనించినప్పటికీ ఈ అవసరాన్ని తీర్చడం కోసం ఎటువంటి చర్యలను చేపట్టడం జరుగలేదు అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధానమైనటువంటి సవాళ్లకు ఎదురీది ఈ పరియోజనను సాధించడం పట్ల శ్రీ మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అండమాన్ & నికోబార్ దీవులలో నివసిస్తున్న ప్రజలకు తక్కువ ఖర్చుతో కూడినటువంటి మరియు ఉత్తమమైనటువంటి సంధానం సదుపాయాన్ని సమకూర్చడం అనేది దేశం యొక్క బాధ్యతగా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ Chennai – Andaman & Nicobar Islands(CANI) submarine connectivity పరియోజనతో అనుబంధితులైన వారందరిని ఆయన అభినందించారు.

అండమాన్ & నికోబార్ దీవులు దిల్లీకి మరియు ప్రధాన భూమి యొక్క హృద‌యాలకు ఏమంత దూరంలో లేవు అని రుజువు చేసే ఒక ప్రయాసే ఈ యొక్క సబ్ మరీన్ కేబుల్ అని శ్రీ మోదీ అభివర్ణించారు.

Join us on Facebook

ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క పౌరురాలికి జీవించడంలో సౌలభ్యం కల్పించడంలో CANI submarine connectivity పాత్ర

దేశంలో ప్రతి ఒక్క పౌరునికి/ప్రతి ఒక్క పౌరురాలికి, అలాగే ప్రతి ఒక్క రంగానికి కూడాను ఆధునిక సదుపాయాలను సమకూర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తద్ద్వారా జీవించడంలో సౌలభ్యం మెరుగుపడగలదని శ్రీ మోదీ అన్నారు.

అండమాన్ & నికోబార్ దీవులను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే ఈ Chennai – Andaman & Nicobar Islands(CANI) submarine connectivity ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు జీవించడంలో సౌలభ్యం దిశగా ప్రభుత్వం యొక్క నిబద్దతకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నదని ఆయన అన్నారు.

జాతీయ భద్రతతో ముడిపడ్డ సరిహద్దు ప్రాంతాలు మరియు ద్వీప రాష్ట్రాలను శరవేగంగా అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం వచనబద్ధమైందని ఆయన చెప్పారు.

Also Read: Webinar on Remote Voting

Chennai Andaman Nicobar Islands submarine connectivity ద్వారా డిజిటల్ ఇండియా తద్వారా అవకాశాల పెరుగుదల

అండమాన్ & నికోబార్ దీవులు చౌక అయినటువంటి మరియు ఉత్తమమైనటువంటి సంధానాన్ని పొందడంలో, మరియు డిజిటల్ ఇండియా యొక్క సకల ప్రయోజనాలు సహాయకారి కాగలదు.

ప్రత్యేకించి ఆన్ లైన్ ఎడ్యుకేషన్, టెలి-మెడిసిన్, బ్యాంకింగ్ వ్యవస్థ, ఆన్ లైన్ ట్రేడింగ్ ను మెరుగుపరచడంలో, అలాగే పర్యాటక రంగానికి ఉత్తేజాన్ని ఇవ్వడంలో ఈ Chennai – Andaman & Nicobar Islands(CANI) submarine connectivity సహాయకారి కాగలదని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం యొక్క వర్తకానికి మరియు వ్యూహాత్మకమైన పరాక్రమానికి వేల సంవత్సరాలుగా హిందూ మహాసముద్రం కేంద్ర స్థానంగా ఉంది.

అదే మాదిరిగా అండమాన్ & నికోబార్ దీవులు భారతదేశం యొక్క ఆర్థిక, వ్యూహాత్మక సహకారానికి ఒక ముఖ్య కేంద్రంగా ఉంటున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం అవలంబించే నూతన వర్తక వ్యూహంలో భారతదేశం యొక్క ద్వీపాలు అన్నీ కూడాను ఒక ముఖ్య పాత్రను పోషించగలవని ఆయన అన్నారు.

యాక్ట్-ఈస్ట్ పాలిసిలో భాగంగా, తూర్పు ఆసియా దేశాలతోను, సముద్రంతో జతపడ్డ ఇతర దేశాలతోను భారతదేశం యొక్క బలమైన సంబంధాలలో అండమాన్ & నికోబార్ దీవుల పాత్ర ఎంతో ఉన్నతమైంది, మరి ఇది పెరగనుంది కూడా మోదీ అన్నారు.

ఈ దీవుల యొక్క పాత్రను బలపరచడం కోసం 3 సంవత్సరాల క్రితం ఐలండ్ డివెలప్ మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయడమైంది అని ఆయన చెప్పారు.

అండమాన్ & నికోబార్ దీవులలో పూర్తి కానటువంటి పరియోజనలు ఇప్పుడు శీఘ్ర గతిన పూర్తి అవుతున్నాయి అని ఆయన అన్నారు.

అధిక ప్రభావశీల పరియోజనాలు మెరుగైన భూమివాయు మార్గాలు మరియు జలమార్గాలు

అండమాన్ & నికోబార్ లోని 12 దీవులలో అధిక ప్రభావశీల పరియోజనాలను విస్తరించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

మెరుగైనటువంటి ఇంటర్నెట్, ఇంకా మొబైల్ కనెక్టివిటిని సమకూర్చడంతో పాటు రోడ్డు, వాయు మరియు జలమార్గాల ద్వారా భౌతిక సంధానాన్ని మరింతగా మెరుగుపరచే ప్రయాస కూడా జరుగుతున్నది.

ఉత్తర మరియు మధ్య అండమాన్లో రోడ్డు సంధానాన్ని మెరుగుపరచడం కోసం ఎన్ హెచ్-4 ను వెడల్పు చేసే పనులకు తోడు రెండు ప్రధానమైన వంతెనల పనులు జరుగుతుండటాన్ని ప్రస్తావించారు.

ఒకే సారి 1200 ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యాన్ని సంతరిస్తూ పోర్ట్ బ్లేయర్ విమానాశ్రయం యొక్క స్థాయిని పెంచడం జరుగుతోందని ఆయన అన్నారు.

దీనితో పాటు దిగ్లీపుర్, కార్ నికోబార్ మరియు క్యాంప్ బెల్ – బేలలో విమానాశ్రయాలు కార్యకలపాలను నిర్వహించడం కోసం సిద్దంగా ఉన్నాయన్నారు.

స్వరాజ్ ద్వీప్, షహీద్ ద్వీప్ మరియు లాంగ్ ఐలండ్ లలో ప్యాసింజర్ టర్మినల్ తో పాటు ఫ్లోటింగ్ జెట్టీ వంటి వాటర్ ఏరోడ్రోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రాబోయే మాసాలలో తయారు అవుతాయని శ్రీ మోదీ తెలిపారు.

కోచి షిప్ యార్డ్ లో నిర్మాణంలో ఉన్నటువంటి 4 నౌకలను ద్వీపాలకు మరియు ప్రధాన భూమికి నడుమన జల సంధానాన్ని మెరుగుపరచడం కోసం త్వరలో అందించనున్నారు. 

 

నౌకాశ్రయాల నాయకత్వంలో అభివృద్ధి

ప్రపంచంలోని అనేక నౌకాశ్రయాల కంటే అండమాన్ & నికోబార్ దీవులు స్పర్ధాత్మక దూరంలో ఉన్నందువల్ల, నౌకాశ్రయాల నాయకత్వంలో అభివృద్ధికి నిలయంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. 

మెరుగైన నౌకాశ్రయాల నెట్ వర్క్ మరియు ఆ నౌకాశ్రయాల సంధాన సౌకర్యాలు ఏ దేశంలో ఉంటాయో ఆ దేశం 21వ శతాబ్దంలో వర్తకానికి ఒక ఉత్తేజాన్ని అందించగలుగుతుంది

స్వయం సమృద్ధి సాధన సంకల్పంతో  భారతదేశం ముందుకుపోతూ, గ్లోబల్ సప్లయ్ చైన్ లోను, గ్లోబల్ వేల్యూ చైన్ లోను ఒక ముఖ్య పాత్రధారిగా తననుతాను ప్రతిష్ఠితం చేసుకొంటున్నది.

ప్రస్తుత తరుణంలో మన జలమార్గాలు మరియు నౌకాశ్రయాల యొక్క నెట్ వర్క్ ను పటిష్టం చేసుకోవడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు.

నౌకాశ్రయాల సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన యొక్క అభివృద్ధిలో న్యాయపరంగా ఎదురవుతున్న అడ్డంకులను కూడాను అదే పనిగా తొలగించడం జరుగుతున్నది అని శ్రీ మోదీ చెప్పారు.

అంతర్జాతీయ సముద్ర సంబంధిత వ్యాపారం

సముద్రంలో వ్యాపార నిర్వహణ సంబంధిత సౌలభ్యాన్ని ప్రోత్సహించడం, ఇంకా మేరిటైం లాజిస్టిక్స్ ను సరళతరం చేయడం పైన కూడా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.

డీప్ డ్రాఫ్ట్ ఇన్నర్ హార్బర్ను త్వరిత గతిన నిర్మించడమేగాక గ్రేట్ నికోబార్లో ట్రాన్సుషిప్మెంట్ పోర్టును దాదాపుగా 10,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే ప్రతిపాదనను ప్రస్తావించారు.

దీనితో పెద్ద ఓడలు లంగరు వేసుకుని ఆగేందుకు వీలు కలుగుతుంది.

మరియు నూతన ఉద్యోగ అవకాశాలతో పాటు సముద్ర సంబంధి వ్యాపారంలో భారతదేశం యొక్క వాటా కూడా పెరుగుతుందని శ్రీ మోదీ అన్నారు.

అండమాన్ & నికోబార్ దీవులలో అభివృద్ధిపరుస్తున్న ఆధునిక మౌలిక సదుపాయాలకు సమానమైన రీతిలో మత్స్యపరిశ్రమ అభివృద్ధి.

చేపలు/రొయ్యల పెంపకం, ఇంకా సముద్రపు కలుపుమొక్కల సాగు వంటి నీలి ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందగలదని ఆయన అన్నారు.

ప్రభుత్వం యొక్క కృషి అండమాన్ & నికోబార్ దీవులకు కేవలం నూతన సదుపాయాలను అందించడమే కాకుండా ప్రపంచ పర్యటక పటంలో ఓ ప్రముఖ స్థానాన్ని కూడా కట్టబెట్టగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.