Maharashtra Day & Gujarat Day

Maharashtra Day & Gujarat Day

Maharashtra Day and Gujarat Day మహరాష్ట్ర దినోత్సవం మరియు గుజరాత్ దినోత్సవం:

Maharashtra Day & Gujarat Day: ప్రపంచమంతా మే1న శ్రామిక దినోత్సవాలు జరుపుకునే వేళ చరిత్ర పుటల్లో నిలిచిపోయిన మరో సంఘటనకు 1960 మే 1 సాక్ష్యంగా నిలిచింది.

ఆ రోజు ఆనాటి బొంబాయి రాష్ట్రం భాషా ప్రాతిపదికన మహరాష్ట్రా మరియు గుజరాత్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డ రోజు.

మే1న ప్రపంచ దేశాలన్నీ శ్రామిక దినోత్సవాలు జరుగుతుంటే, ఈ రెండు రాష్ట్రాలలో వాటికంటే ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగుతుంటాయి.

చదవండి: May 2020 Important Days and Events

చారిత్రక నేపధ్యం

స్వాతంత్రం అనంతరం కచ్, సౌరాష్ట్ర, గుజరాత్, బొంబాయి ఇలా అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ అప్పటి రాజకీయ, స్థానిక, పరిపాలనాపర అనేక అంశాల కారణంగా ఏర్పడ్డ రాష్ట్రాలు.

క్రమంగా ప్రత్యేక రాష్ట్రాల కోసం ఆందోళనలు జోరందుకున్నవి. అందులో మద్రాసు రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం జరిగిన ఆందోళనలు కూడా ఒకటి.

ఈ ఆందోళనల పర్యవశానంగా 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని అనుసరించి భాషా సంయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది.

అలా ఏర్పడినవే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర రాష్ట్రాలు. దాదాపు ఈ రాష్ట్రాలన్నీ ప్రధానంగా ఒకే భాష మాట్లాడే రాష్ట్రాలే

వీటికి భిన్నంగా గుజరాతీ, మరాఠీ, కచ్చీ, కోంకణి వంటి అనేక భాషల ప్రజలతో నాడు విశాల బొంబాయి రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో ప్రధానంగా వాడుకలో ఉన్నవి గుజరాతీ, మరాఠీ రెండు భాషలు.

1956 the new sate of bobmay map

చదవండి: World Book And Copyright Day

అసంతృప్తి మిగిల్చిన రాష్ట్రాల ఏర్పాటు

ఐతే అది అక్కడి ప్రజలలో అసంతృప్తిని మాత్రమే మిగిల్చింది. గుజరాతీ మరియు కచ్చీ భాషలు ప్రధానంగా మాట్లాడే ప్రాంతాన్ని గుజరాత్ గానూ, మరాఠీ మరియు కోంకణి భాషలు మాట్లాడే ప్రాంతాలను మహరాష్ట్రగాను ఏర్పూటు చేయాలని సంయుక్త మహరాష్ట్ర సమితి పోరాటానికి దిగింది.

మరాఠీ ప్రజల పరిస్థితికి ఏ మాత్రం భిన్నంగా లేనది గుజరాతీ ప్రజల పరిస్థితి సైతము. ప్రత్యేక గుజరాతీ రాష్ట్రం అన్నది గుజరాతీయుల చిరకాల స్వప్నం.

స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి గుజరాతీ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళనలు జరుపుతూనే ఉన్నారు.

ఐతే స్వాతంత్రం తరువతా రాష్ట్రాల పునర్విభజనపై అధ్యయనం చేసిన ధార్ కమీషన్ చిన రాష్ట్రాలు అందునా భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు దేశ భవిష్యత్తుకు అంత శ్రేయస్కరం కాదని నివేదినివ్వడంతో బొంబాయి నాటి కచ్, సౌరాష్ట్రాలను కలుపుకుని విశాల ద్విభాషా రాష్ట్రంగా అవతరించింది.

maharashtra map unveiled by nehru

గుజరాత్, మహరాష్ట్ర ఉద్యమాలపై ఆంధ్ర రాష్ట్ర అవతరణ ప్రభావం

1952లో మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు గారు అమరులైన తరువాత 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

ఆంధ్ర రాష్ట్ర అవతరణ అటు గుజరాతీయులు ఇటి మరాఠీలలో కొత్త ఉత్తేజాన్ని నింపింది, పారాటాలు ఉగ్రరూపం దాల్చాయి.

వాటి ఫలితం 1960 లో బొంబాయి రియార్గనైజేషన్ యాక్టు పార్లమెంటులో ఆమోదం పొంది 1 మే 1960 నుండి అది అమలులోకి వచ్చింది. దానితో అప్పటి వరకు ఒకటే ద్విభాషా రాష్ట్రంగా ఉన్న బొంబాయి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా అవతరించింది.

ఈ Maharashtra Day వేడుకల్లో భాగంగా మహరాష్ట్ర ప్రభుత్వం ముంబాయి లోని దాదర్ వద్ద గల శివాజీ పార్కులో ఆ రాష్ట్ర గవర్నర్ ప్రశంగంతో పాటు, పోలిసుల కవాతులు మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు.