National Mission for a Green India

National Mission for a Green India హరిత భారత్ కోసం జాతీయ మిషన్

National Mission for a Green India హరిత భారత్ కోసం జాతీయ మిషన్ అనేది కార్బన్ సింక్‌లతో సహా పర్యావరణ వ్యవస్థ సేవలను మెరుగుపరచడానికి ప్రారంభించబడింది.

ఈ మిషన్ National Action plan on Climate Change (NACC)లో భాగంగా ప్రారంభించిన 8 మిషన్లలో ఒకటి.

పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మరియు జీవ వైవిధ్యం నిర్వహణలో అడవులు అనివార్యమైన పాత్రను పోషిస్తాయి. అడవులు అత్యంత ప్రభావవంతమైన కార్బన్-సింక్లలో ఒకటి.

6 మిలియన్ హెక్టార్ల అటవీకరణ కోసం ప్రధాని గ్రీన్ ఇండియా ప్రచారాన్ని ప్రకటించారు.

జాతీయ భూభాగంలో అటవీ మరియు చెట్ల విస్తీర్ణం 33 % లక్ష్యం కాగా, ప్రస్తుతం అది 24.56 % గా ఉంది.

ఉమ్మడి అటవీ నిర్వహణ కమిటీల ద్వారా నిర్వహించబడి రాష్ట్ర ప్రభుత్వాల అటవీ శాఖలచే మార్గనిర్దేశం చేయబడే కమ్యూనిటీల ప్రత్యక్ష చర్య ద్వారా క్షీణించిన అటవీ భూములపై ఈ మిషన్ దృష్టి సారిస్తుంది.

ఈ కార్యక్రమానికి Compensatory Afforestaion Management and Planning Authority (CAMPA) ద్వారా ప్రారంభించడానికి రూ. 6000 కోట్లకు పైగా మూలధనవం కేటాయించబడింది.

మిగిలిన అన్ని క్షీణించిన అటవీ భూములను పరిరక్షించే విధంగా ఈ కార్యక్రమం అభివృద్ధి చేయబడుతుంది.

అడవులు జన్యు వైవిధ్యానికి సురక్షిత కేంద్రాలు, అంతేగాక విస్తృతమైన పర్యావరణ వ్యవ స్థ సమతుల్యతను కాపాడేందుకు మూలాధారం.

దేశంలోని మొత్తం ఇంధన అవసరాలలో అడవులు దాదాపు 40% వరకు తీరుస్తున్నవి, అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 80% పైగా తీరుస్తున్నది.

అటవీ ఆధారిత ప్రజలకు జీవనోపాధి మరియు సంరక్షణా పరంగా అడవులు వెన్నెముకగా నిలుస్తున్నవి.

అడవులు బయోమాస్ మరియు కార్బన ముత్తికల రూపంలో బిలియన్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ను కట్టడిచేస్తున్నవి.

National Mission for a Green India దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు ఆటవీ సాంద్రతను పెంచడం మరియు జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం అనే రెండు లక్ష్యాలపై దృష్టి పెడుతుంది.

చదవండి: National Water Mission – జాతీయ నీటి మిషన్

National-Mission-for-Green-India

1) అటవీ విస్తీర్ణం మరియు సాంద్రత పెంచుట

భారతదేశంలోని భౌగోళిక ప్రాంతంలో మూడింట ఒక వంతు అటవీ పరిధిలోకి తీసుకురావడం ఈ మిషన్ లక్ష్యం.

ఉమ్మడి అటవీ నిర్వహణ కమిటీల (JFMC) భాగస్వామ్యంతో 6 మిలియన్ హెక్టార్ల క్షీణించిన అటవీ భూములను గ్రీనింగ్ ఇండియా కార్యక్రమం కింద పునరుద్ధరిస్తారు.

సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం ఇతర అవసరాలకోసం వినియోగించ బడ్డ అటవీ భూములకు పరిహారం కింద లభించిన దాదాపూ రూ. 6000 కోట్ల అదనపు నిధులను ఇందుకు ఉపయోగిస్తారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టే అంశాలు:

a) మారుతున్న శీతోష్ణస్థితికి అణుగునంగా వేగంగా పెరుగే జాతుల చెట్ల పెంపకానికై సిల్వి కల్చరల్ (చెట్ల పెంపక శాస్త్రం)పద్ధతులపై శిక్షణ అందించడం.

b) జంతువుల మరియు వృక్ష జాతుల వలసలకు కారిడార్లను ఏర్పాటు చేయడం ద్వారా అడవుల విచ్ఛిన్నతను తగ్గించడం.

c) అటవీ విస్థీర్ణం మరియు అడవుల సాంద్రతను పెంచడానికి తోటలను పెంచడానికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పెట్టుబడులను మెరుగుపరచడం

d) అటవీ నిర్వహణ కోసం జాయింట్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ (JFM) మరియు వన్ పంచాయతీ కమిటీలు వంటి కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాలను పునరుద్ధరించడం మరియు పెంచడం.

e) గ్రీనింగ్ ఇండియా ప్రణాళిక అమలు

f) అటవీ అగ్ని నిర్వహణ వ్యూహాల సూత్రీకరణ

2) జీవవైవిధ్య పరిరక్షణ BioDiversity Conserving

Join us on Telegram

National Mission for a Green India కార్యక్రమంలో 2వ లక్ష్యం జీవవైవిథ్య పరిరక్షణ

తోటలు, రక్షిత ప్రాంతాలు మరియు ఇతర జీవవైవిధ్య కేంద్రాలు వంటి సహజ ప్రదేశాలలో వన్యప్రాణులతో పాటు జీవవైవిధ్య పరిరక్షణ అనేది, పర్యావరణ వ్యవస్థల యొక్క స్థితిస్థాపకతను కొనసాగించడానికి ఎంతో కీలకమైనది.

ఈ కార్యక్రమంలోని నిర్దిష్ట చర్యలు:

a) జన్యు వనరులు అందునా అంతరించి పోతున్న వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క పరిరక్షణ

b) వైవిధ్యతను మరియు అనుబంధ సాంప్రదాయ జ్ఞానాన్ని నమోదు చేయడానికి జాతీయ, జిల్లా మరియు స్థానిక స్థాయిలో జీవవైవిధ్య రిజిస్టర్ల రూపకల్పన.

c) వన్యప్రాణుల సంరక్షణ చట్టం క్రింద రక్షిత ప్రాంత వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడం

d) జాతీయ జీవవైవిధ్య పరిరక్షణ చట్టం, 2001 యొక్క ప్రభావవంతమైన అమలు