National Mission on Strategic Knowledge for Climate Change

National Mission on Strategic Knowledge for Climate Change వాతావరణ మార్పు కోసం వ్యూహాత్మక జ్ఞానంపై జాతీయ మిషన్:

National Mission on Strategic Knowledge for Climate Change వాతావరణ మార్పుల యొక్క సవాళ్లను మరియు ప్రతిస్పందనలను గుర్తించడానికి బహిరంగ వేదికలు సహా అనేక యంత్రాంగాల ద్వారా గ్లోబల్ కమ్యూనిటీలో పరిశోధన మరియు సాంకేతిక అభివృద్ధి సాధించడానికి పరస్పర సహకారంతో ఏర్పాటు చేయబడింది.

ఈ మిషన్ వాతావరణ మార్పు యొక్క వివిధ అంశాలపై నాణ్యమైన కేంద్రీకృత పరిశోధనలకు నిధులు సమకూరుస్తుంది.

ఆరోగ్యం, జనాభా, వలసల సరళి మరియు తీరప్రాంత సమాజాల జీవనోపాధి సహా వాతావరణ మార్పుల యొక్క సామాజిక-ఆర్థిక ప్రభావాలను ఈ మిషన్ ద్వారా పరిశోధిస్తారు.

విశ్వవిద్యాలయాలు మరియు దేశంలోని ఇతర విద్యా మరియు శాస్త్రీయ పరిశోధనా సంస్థలలో ప్రత్యేకమైన వాతావరణ మార్పు సంబంధిత విద్యా విభాగాల స్థాపనకు ఈ మిషన్ మద్దతు ఇస్తుంది.

పరిశోధనలకు తోడ్పడటానికి ఈ మిషన్ కింద క్లైమేట్ సైన్స్ రీసెర్చ్ ఫండ్ సృష్టించబడుతుంది. 

వెంచర్ క్యాపిటల్ ఫండ్ల ద్వారా వాతావరణ మార్పుల అనుసరణ మరియు ఉపశమనం కోసం వినూత్న సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి ప్రైవేట్ రంగ కార్యక్రమాలు ప్రోత్సహించబడతాయి.

గుర్తించిన కేంద్రాల ద్వారా విధానాల రూపకల్పన మరియు అమలుకు తోడ్పడే పరిశోధనలు చేపట్టబడతాయి.

పరిశోధన ఫలితాల ఆధారంగా జ్ఞానాన్ని వ్యాప్తి చేయడంపై కూడా ఈ మిషన్ దృష్టి సారిస్తుంది.

National Mission on Strategic Knowledge for Climate Change ఈ క్రింది ముఖ్య ఇతివృత్తాల ఆధారంగా వాతావరణ మార్పులను ఎదుర్కునేందుకు ప్రయత్నిస్తుంది:

a) రుతుపవన గమనాలు, ఏరోసోల్ సైన్స్ మరియు పర్యావరణ వ్యవస్థ ప్రతిస్పందనలు వంటి కీలకమైన ఆంశాలు మరియు ప్రక్రియల యొక్క అవగాహనను మెరుగుపరచేందుకు వాతావరణ శాస్త్రం యొక్క కీలకమైన రంగాలలో పరిశోధన.

b) నీటి కాలచక్రంలో మార్పులతో సహా, భారత ఉపఖండంలో వాతావరణ మార్పు అంచనాలలో నాణ్యత మరియు విశిష్టతను మెరుగుపరచడానికి అంతర్జాతీయ మరియు స్థానిక నమూనాలను అనుసరించుట.

c) పరిశీలనాత్మక వ్యవస్థలను బలోపేతం చేయడంతోబాటు సమాచార సేకరణ మరియు సమీకరణ, సంబంధిత సమాచార లభ్యతను పెంచే చర్యలు చేపట్టుట.

d) గణన మరియు సమాచార వనరులను అందుబాటులో ఉంచడంతోబాటు అవసరమైన సమాచారాన్ని శాస్త్రవేత్తలు పరస్పరం సులభంగా ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా

 అధిక సామర్ధ్యం గల కంప్యూటింగ్ వ్యవస్థ మరియు విస్తృత బ్యాండ్‌విడ్త్ నెట్‌వర్క్‌లు వంటి ముఖ్యమైన పరిశోధన అవస్థాపన సదుపాయాలు కల్పించుట.

చదవండి: Pradhan Mantri Krishi Sinchayee Yojana(PMKSY)

National Mission on Strategic Knowledge for Climate Change

ఈ విస్తృత ఇతివృత్తాలు దిగువ పేర్కొన్న ఉప విభాగాలలో వివరించబడ్డాయి:

క్లైమేట్ మోడలింగ్ మరియు సమాచార ప్రాప్యత

వాతావరణ మార్పులపై IPCC-AR 4 సాధారణ ప్రపంచ పోకడలను పరిష్కరించినప్పటికీ, ప్రాదేశిక వివరణాత్మక అంచనాలు భారతదేశానికి అందుబాటులో లేవు.

దీనికి కారణం అల్ప కంప్యూటింగ్ శక్తి, వాతావరణ సంబంధిత సమాచారాన్ని పొందడంలో ఇబ్బందులు మరియు భారతదేశంలోని వాతావరణ మోడలింగ్ పరిశోధన సమూహాలలో శిక్షణ పొందిన మానవ వనరుల కొరత.

వీటిని అధిగమించడానికి ఈ కింది చర్యలు తీసుకోబడతాయి:

Join us on Telegram

భారతదేశంలో క్లైమేట్ మోడలింగ్ పై మెరుగైన పరిశోధన

సంస్థాగత సామర్థ్యాలు మరియు గణన వనరులను సమీకరించడం ద్వారా ప్రాంతీయ వాతావరణ మార్పులను, ముఖ్యంగా రుతుపవనాల ప్రవర్తనను అనుకరించే high resolution Air Ocean General Circulation Models (AOGCM)

 మరియు సమూహ ప్రాంతీయ వాతావరణ నమూనాలు (nested Regional Climate Models – RCM) అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది.

జనరల్ సర్క్యులేషన్ మోడల్స్ (General Circulation Models GCM) విషయంలో, రుతుపవనాల ప్రవర్తనను సమర్థవంతంగా అనుకరించే అధిక రిజల్యూషన్‌తో పాటు AOGCM ను అభివృద్ధి చేయడానికి జాతీయ స్థాయి కోర్ క్లైమేట్ మోడలింగ్ సమూహాలను నిర్మించాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుత మరియు భవిష్యత్తు వాతావరణం యొక్క బహుళ-సమిష్టి మరియు బహుళ-సంవత్సరాల అనుకరణల కోసం ఇవి ఉపయోగించబడతాయి.

జిల్లా స్థాయి వరకు ఖచ్చితమైన భవిష్యత్ వాతావరణ అంచనాలను రూపొందించడానికి స్వదేశీ ప్రాంతీయ వాతావరణ నమూనాలు (RCM) అవసరం.

ప్రాంతీయ సమాచార పునఃవిశ్లేషణ కార్యక్రమాలను ప్రోత్సహించాలి. భవిష్యత్ వాతావరణ అంచనాలలో అనిశ్చితిని తగ్గించడానికి వాతావరణం కోసం Regional Model Inter-comparison Project (RMIP) అవసరం.

చదవండి: Pradhan Mantri Matsya Sampada Yojana

ఈ మిషన్ సమాచార ప్రాప్యతను(Access) ప్రోత్సహిస్తుంది

వాతావరణ పరిశోధనలకు సంబంధించిన అనేక డేటాబేస్‌లు ఉన్నాయి, ఆ సమాచారాన్ని సేకరించి సరఫరా చేయడం సంబంధిత శాఖల బాధ్యత.

ఈ శాఖలు మరియు విభాగాలు సమాచార ప్రాప్యతను అందించేందుకు ఒక ‘ఫెసిలిటేటర్’ను నియమించవచ్చు.

ప్రభుత్వంలోని వివిధ శాస్త్రీయ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు కలిగి ఉన్న వాతావరణ సంబంధిత సమాచారాన్ని సులభంగా పొందేందుక ‘రిజిస్టర్డ్ యూజర్స్’ అనే భావన ప్రతిపాదించబడింది.

ఈ సమాచార లభ్యతపై పరిమితులను సమీక్షించాల్సిన అవసరం ఉంది. సంబంధిత శాఖలు మరియు వారి ఏజెన్సీలు సమాచారన్ని డిజిటలైజ్ చేయడానికి, డేటాబేస్లను ప్రపంచ స్థాయి నాణ్యతతో నిర్వహించడానికి మరియు ప్రాప్యతను నియంత్రించే విధానాలను క్రమబద్ధీకరించడానికి కూడా చర్యలు తీసుకోవాలి.

Join us on Facebook

నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం

నేషనల్ నాలెడ్జ్ కమిషన్ మరియు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం సూచించిన విధంగా పదుల జిబిపిఎస్ సామర్థ్యానికి అభివృద్ధి చేయగలిగే ఇంటిగ్రేటెడ్ నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్ సృష్టించడం వాతావరణ అధ్యయనాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

గ్రిడ్ కంప్యూటింగ్ టెరాబైట్ల వరకు ఉన్న ప్రయోగాత్మక సమాచారాన్ని నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానంగా నిలుస్తుంది, దీనికి వందలాది టెరాఫ్లోప్స్ కంప్యూటింగ్ శక్తి అవసరం.

పదకొండవ ప్రణాళికలో తమ సూపర్ కంప్యూటింగ్ వనరులను పెంచడానికి ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు చర్యలు తీసుకున్నాయి.

చదవండి: 12000 HP made in India locomotive

మానవ వనరుల అభివృద్ధి

వాతావరణ మార్పులకు సంబంధించిన కొత్త సవాళ్లను ఎదుర్కోవటానికి, పాఠశాల మరియు కళాశాల స్థాయిలలో పాఠ్యాంశాలలో మార్పులు, విశ్వవిద్యాలయ స్థాయిలో కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టాలి.

అంతేకాక సంబంధిత రంగాలలో నిపుణులు మరియు కార్యనిర్వాహకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మానవ వనరులను మెరుగుపరచడం అవసరం.

జాతీయ, రాష్ట్ర మరియు స్థానిక స్థాయిలో అవసరమైన అదనపు నైపుణ్యాల యొక్క మొత్తం అంచనాను నిర్వహించాల్సి ఉంటుంది.

తద్వారా భవిష్యత్తులో అవసరమైన మానవ వనరుల నాణ్యత మరియు పరిమాణాన్ని పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టవచ్చు.

యువతను సాధారణంగా సైన్స్ వృత్తికి ఆకర్షించడంలో ఇబ్బందుల ఎదురౌతున్న ప్రస్తుత నేపథ్యంలో అవసరమైన మానవ వనరుల నాణ్యతకై చర్యలు తప్పనిసరి.

Join us on YouTube