The Pradhan Mantri Krishi Sinchayee Yojana (PMKSY)
2015 జూలై 1 న ‘హర్ ఖేత్ కో పానీ’ ప్రతీ పొలానికి నీరు అనే నినాదంతో The Pradhan Mantri Krishi Sinchayee Yojana ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన (PMKSY) ప్రారంభించబడింది.
నీటిపారుదల వ్యవస్థలో భాగంగా నీటి వనరులు, పంపిణీ వ్యవస్థ మరియు క్షేత్రస్థాయి అనువర్తనాలు వంటి సమూల పరిష్కారాలను అందించడం కోసం ఈ పధకం రూపొందించబడింది.
PMKSY నీటిపారుదల కోసం వనరులను సృష్టించడం మాత్రమే కాకుండా, ‘జల్ సంచాయ్’ మరియు ‘జల్ సించన్’ ద్వారా క్షేత్ర స్థాయిలో వర్షపు నీటిని ఉపయోగించడం ద్వారా రక్షిత నీటిపారుదల వ్యవస్థని రూపొందించేందుకు కూడా ఈ పధకం ఉపకరిస్తుంది.
ఈ పధకంలో భాగంగా ‘PER DROP-MORE CROP’ ‘ప్రతీ బొట్టూకూ అధిక దిగుబడి’ ఉండేలా సూక్ష్మ సేద్యాన్ని ప్రాచుర్యం లోకి తేవాలి.
జిల్లా స్థాయి నీటిపారుదల ప్రణాళికలు మరియు రాష్ట్ర నీటిపారుదల ప్రణాళికల ఆధారంగా రాష్ట్రాలు తమ సొంత నీటిపారుదల అభివృద్ధికి రూపొందించిన రాష్ట్ర స్థాయి ప్రణాళికలను The Pradhan Mantri Krishi Sinchayee Yojana అనుసరిస్తుంది.
చదవండి: Pradhan Mantri Matsya Sampada Yojana
PMKSY లో వివిధ భాగాలు
Accelerated Irrigation Benefit Programme (AIBP): ఈ పధకాన్ని జల వనరుల మంత్రిత్వ శాఖ యొక్క Rural Development and Ganga Rejuvenation (RD & GR) అమలు చేస్తోంది.
హర్ ఖేత్ కో పానీ: ఈ కార్యక్రమాన్ని జల వనరుల మంత్రిత్వ శాఖ, RD & GR అమలు చేస్తోంది
Watershed: ఈ పధకాన్ని భూ వనరుల శాఖ అమలు చేస్తోంది.
Per Drop More Crop (PDMC): 2015-16 నుండి అమలులో ఉన్న PMKSYలో భాగమైన PDMCను వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ అమలు చేస్తోంది.
PDMC ప్రధానంగా వ్యవసాయ క్షేత్ర స్థాయిలో సూక్ష్మ సేద్యం (Micro Irrigation MI) (బిందు మరియు తుంపర్ల సేద్యం) ద్వారా సమర్ధవంతంగా నీటిని వినియోగించడంపై దృష్టి పెడుతుంది.
అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించడానికి ఖచ్చితమైన నీటిపారుదల మరియు సరైన క్షేత్ర స్థాయి నీటి నిర్వహణా పద్ధతులను ప్రోత్సహిస్తుంది.
అంతేగాక ఈ పధకం క్షేత్ర స్థాయిలో నీటి నిల్వ లేదా నీటి సంరక్షణ మరియు నిర్వహణ కార్యకలాపాలు వంటి ఇతర అంశాల ద్వారా మెరుగైన నీటి పారుదలకు ఉపకరిస్తుంది.
2019-20 సంవత్సరానికి బడ్జెట్
బడ్జెట్ కేటాయింపులో Per Drop More Crop భాగాన్ని అమలు చేయడానికి రూ. 3500 కోట్లు కేటాయించారు.
సూక్ష్మ నీటిపారుదల:
2006 జనవరి నుండి, వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత మైక్రో ఇరిగేషన్ పథకాన్ని అమలు చేస్తోంది.
ఈ పథకం కింద, రైతులను నీటి సంరక్షణ మరియు పొదుపుతో పాటు మెరుగైన దిగుబడి కొరకు బిందు సేద్యం మరియు తుంపర్ల సేద్యం దిశగా ప్రోత్సహిస్తారు.
జూన్ 2010 లో, ఈ పథకాన్ని National Mission on Micro Irrigation (NMMI) కు పెంచారు, ఇది 2013-14 సంవత్సరం వరకు కొనసాగింది.
1 ఏప్రిల్ 2014 నుండి, NMMI National Mission on Sustainable Agriculture (NMSA)లో ఒక భాగంగా అమలు కాబడుతుంది.
2014-15లో ఇది “On Farm Water Management” (OFWM) కింద ఒక భాగంగా అమలు చేయబడింది.
జూలై 1, 2015 నుండి, ఈ పథకం ప్రధాన్ మంత్రి కృషి సిన్చాయీ యోజన (PMKSY) కింద ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్ (మైక్రో ఇరిగేషన్)’లో భాగంగా అమలు చేయబడింది.
చదవండి: Bharat Ratna Awards Complete Information
The Pradhan Mantri Krishi Sinchayee Yojana లోని సూక్ష్మ నీటిపారుదల పథకం యొక్క ముఖ్యమైన లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:
Per Drop More Crop (PDMC) కింద, మైక్రో ఇరిగేషన్ వ్యవస్థ అమలుకై చిన్న మరియు ఉపాంత రైతులకు 55% మరియు ఇతర రైతులకు 45% ఆర్థిక సహాయం లభిస్తుంది.
నవంబర్ 2015 నుండి ఈ కార్యక్రమ అమలుకు ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు 60:40 గా ఉంది.
ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాలలో ఈ వాటాలు 90:10 గా ఉంది.
పథకం యొక్క కార్యాచరణ మార్గదర్శకాల ప్రకారం, ప్రభుత్వ ఆర్థిక సహాయానికై వివిధ పంటలు మరియు వివిధ సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలతో సూచనాత్మకంగా సగటు ప్రామాణిక వ్యయం నిర్ణయించబడింది.
ఈ పధకంలో ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాలకు అన్ని వ్యవస్థల యొక్క సాధారణ ధర కంటే 25% ఎక్కువ నిర్ణయించబడింది.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు మరియు అన్ని జిల్లాలకు ఈ పథకం వర్తిస్తుంది.
ఈ పధకం కింద ప్రతి రైతు 5 హెక్టార్ల గరిష్ట కమతానికి లబ్దిదారుడు కావచ్చు.
ఒకే భూమిపై 7 సంవత్సరాల వ్యవధి తర్వాత మాత్రమే తిరిగి సహాయం పొందవచ్చు.
అన్ని ఉద్యాన మరియు వ్యవసాయ పంటలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.
పథకం కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులలో కనీసం 25% వ్యవసాయ పంటలకు తప్పనిసరిగా ఉపయోగించాలి.
రాష్ట్రానికి కేటాయించిన కేటాయింపులలో కనీసం 50% చిన్న మరియు ఉపాంత రైతుల కోసం ఉపయోగించుకోవాలి.
అందులో కనీసం 30% మహిళా లబ్ధిదారులు లేదా రైతులు ఉండాలి.
అంతేకాక, మొత్తం కేటాయింపులో షెడ్యూల్డ్ కులాలు (SC) / షెడ్యూల్డ్ తెగలు (ST)ల వారికి 16% మరియు 8% కేటాయించాలి.
లేదా వారి జనాభా నిష్పత్తులను అనుసరించి స్పెషల్ కాంపోనెంట్ సబ్ ప్లాన్ (SCSP) మరియు గిరిజన సబ్-ప్లాన్ (TSP) కోసం ఉపయోగించాలి.
భారతీయ ప్రమాణాలకు (BIS Standards) కు అనుగుణంగా ఉన్న పరికరాలకు మాత్రమే ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందుతుంది.
స్కీమ్ అమలు ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి మరియు ఈ కార్యక్రమం యొక్క సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) విస్తృతంగా ఉపయోగించబడింది.
నీటి వనరుల సృష్టి మొదలుకుని క్షేత్రస్థాయిలో సమగ్ర పద్ధతిలో నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధికి PMKSY రూపొందించబడింది.
దీని ప్రకారం, Pradhan Mantri Krishi Sanchayee Yojana యొక్క అన్ని విభాగాలు ఒకదానితో ఒకటి ముడిపడి సంపూర్ణంగా అమలు చేయబడతాయి.
చదవండి: భారత జీ.డీ.పీ. పయనం ఎటువైపు?
సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ రైతులకు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది.
బిందు మరియు తుంపర్ల సేద్యాలతో కూడిన మైక్రో ఇరిగేషన్ భారతీయ రైతులలో విపరీతమైన ప్రజాదరణ పొందిన సాంకేతిక పరిజ్ఞానం.
ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క బలాలు – నీరు, విద్యుత్, ఎరువులు, శ్రమ మొదలైన కారకాలను సమర్థవంతంగా వినియోగించుట.
తద్వారా అధిక ఉత్పాదకతతో పాటు నాణ్యమైన ఉత్పత్తి వల్ల అమ్మకపు ధర లాభసాటిగా ఉంటుంది. ఫలితంగా రైతు ఆదాయం పెరుగుతుంది.
ఈ సాంకేతిక పరిజ్ఞానంతో, సాంప్రదాయిక నీటిపారుదల పద్ధతులతో పోలిస్తే అదే నీటి మొత్తంతో అధిక ప్రాంతానికి సేద్యం చేయవచ్చు.
అంతేగాక ఈ ఆధునిక సాంకేతికతతో, నీటి కొరత, సాగు చేయదగిన వ్యర్థ భూములు మరియు ఎత్తుపల్లాలుగా ఉన్న భూములను కూడా తేలికగా సాగులోకి తీసుకురావచ్చు.
ఈ సాంకేతిక పరిజ్ఞానంతో, బియ్యం, గోధుమ, ఉల్లిపాయ, బంగాళాదుంప వంటి పంటలలో దీనిని ఉపయోగించటానికి మంచి అవకాశం ఉంది.
ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రయోజనాలు భూమి మరియు ఉపరితల నీటి కాలుష్యాన్ని నియంత్రించడానికి ఉపకరిస్తాయి.
రైతులను నగరాలకు వలస రావడాన్ని నివారించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కల్పన మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీతో సాధ్య పడుతుంది.
మైక్రో ఇరిగేషన్ ఫలితాలపై 2014లో జరిగిన ఒక అధ్యయనం ప్రాకారం:
నీటిపారుదల వ్యయం 20% నుండి 50% వరకు తగ్గింది, ఇది సగటున 32.3% వరకు తగ్గినట్లు.
విద్యుత్ వినియోగం సుమారు 31% తగ్గింది.
ఎరువుల పొదుపు 7% నుండి 42% వరకు ఉంది.
పండ్లు మరియు కూరగాయల సగటు ఉత్పాదకత సుమారు 42.3% నుండి 52.8% వరకు పెరిగింది.
మొత్తం రైతుల ఆదాయం 48.5 % సగటుతో 20 % నుండి 68 % వరకు పెరిగింది.
సూక్ష్మ నీటిపారుదల యొక్క సానుకూల ఫలితాల వల్ల వివిధ పంటల ఉత్పత్తి మరియు ఉత్పాదకత పెరగింది.
అంతేగాక ఉన్న నీటి వనరు నుండే నీటిపారుదల కింద సాగు విస్తీర్ణం పెరగడం కారణంగా పౌష్టికాహార భద్రతను అందించ గలిగింది.
బిందు సేద్యం ద్వారా నీటిలో కరిగే ఎరువులను ఉపయోగించడం వల్ల (ఫెర్టిగేషన్), ఎరువుల వినియోగం తగ్గడం తద్వారా ఖర్చు ఆదా అవుతున్నట్లు పరిశోధనలు తెలుపుతున్నవి.