National Action Plan on Climate Change

National Action Plan on Climate Change వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక

ఒక పక్క climate change వల్ల ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కుంటూనే భారతదేశం తన వేగవంతమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించడం అనేది ఒక పెద్ద సవాలు.

ఈ ముప్పు వాతావరణంలో పేరుకుపోయిన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల నుండి ఉద్భవించింది, దీర్ఘకాలికంగా మితిమీరిన పారిశ్రామిక వృద్ధి మరియు అభివృద్ధి చెందిన దేశాలలో అధిక వినియోగ జీవనశైలి ద్వారా ఈ ఉద్గారాలు ఉత్పత్తి అవుతున్నాయి.

ఈ ముప్పును అంతర్జాతీయ సహకారంతో సమిష్టిగా ఎదుర్కోవలసిన అవసరం ఉంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా, భారత అభివృద్ధి పధంలో పర్యావరణ స్థిరత్వాన్ని మరింత పెంచడానికి జాతీయ వ్యూహం అవసరం.

వాతావరణ మార్పు భారతదేశం యొక్క సహజ వనరుల పంపిణీ మరియు నాణ్యతపై ప్రభావం చూపుతూ ప్రజల జీవనోపాధిపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

మనదేశ ఆర్థిక వ్యవస్థకు, సహజ వనరులకు అవినాభావ సంబంధం ఉన్నది.

భారతదేశ ఆర్ధిక వ్యవస్థలో అత్యధిక ఉపాధిని అందించే వ్యవసాయం, మరియు అటవీ రంగాలు పూర్తిగా నీటి ఆధారితం తద్వారా వాతావరణ మార్పులతో బలీయంగా ముడిపడి ఉన్నది.

వాతావరణంలో సంభవించనున్న మార్పుల కారణంగా భారతదేశ ఆర్ధిక వ్యవస్థ పెను ముప్పును ఎదుర్కోనుంది.

భారతదేశ అభివృద్ధి పధం దాని ప్రత్యేకమైన వనరులపై ఆధారపడి ఉన్నది.

ఆర్థిక, సామాజిక అభివృద్ధి మరియు పేదరిక నిర్మూలనకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడమే కాక పర్యావరణానికి అధిక విలువనిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుకునే మన నాగరిక వారసత్వానికి కట్టుబడి ఉండటంపై భారత అభివృద్ధి పధం ఆధారపడి ఉంటుంది.

అభివృద్ధి యొక్క ప్రారంభ దశలో ఉన్నందున పర్యావరణపరంగా స్థిరమైన అభివృద్ధి మార్గాన్ని రూపొందించడంలో, భారతదేశానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నవి.

ఆర్థిక మరియు పర్యావరణ లక్ష్యాలను ఏకకాలంలో అభివృద్ధి చేసే స్థిరమైన అభివృద్ధి మార్గాన్ని సాధించడానికి, National Action Plan on Climate Change వాతావరణ మార్పుల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక (NAPCC) కొన్ని సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది.

Join us on Telegram

NATIONAL ACTION PLAN ON CLIMATE CHANGE

NAPCC సూచించిన మార్గనిర్దేశకాలు:

a) వాతావరణ మార్పులకు అనుగుణంగా స్థిరమైన సమగ్ర అభివృద్ధి వ్యూహం ద్వారా సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలను రక్షించడం.

b) గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను మరింత తగ్గిస్తూ పర్యావరణ స్థిరత్వాన్ని పెంచే దిశలో గుణాత్మక మార్పు ద్వారా జాతీయ వృద్ధి లక్ష్యాలను సాధించడం.

c) అంతిమ ఉపయోగం కోసం డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్ కోసం సమర్థవంతమైన ఆర్ధికంగా ఉపయుక్తమైన వ్యూహాలను రూపొందించడం.

d) గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను వేగంగా మరియు విస్తృతంగా తగ్గించేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం.

e) స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి మార్కెట్, నియంత్రణ మరియు స్వచ్ఛంద విధానాల యొక్క కొత్త మరియు వినూత్న రూపాలను రూపొందించడం.

f) పౌర సమాజం మరియు స్థానిక ప్రభుత్వ సంస్థలతో సహా, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ప్రత్యేకమైన అనుసంధానాలతో కార్యక్రమాల అమలును ప్రభావితం చేయడం.

g) సాంకేతిక పరిజ్ఞానం యొక్క పరిశోధన, అభివృద్ధి, భాగస్వామ్యం మరియు బదిలీ కోసం అంతర్జాతీయ సహకారాన్ని స్వాగతించడం అందుకు అదనపు నిధుల కేటాయించటం మరియు UNFCCC క్రింద అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక బదిలీని సులభతరం చేసే IPR ను ప్రోత్సహించడం.

Join us on Facebook

ఎనిమిది జాతీయ మిషన్లు

వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కోవడంలో మనం ఒకేసారి అనేక రంగాల్లో దృష్టి కేంద్రీకరించాలి. జాతీయ కార్యాచరణ ప్రణాళిక కొత్త సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి మరియు వాడకంపై ఆధారపడి ఉంటుంది.

ప్రణాళిక అమలు ప్రతి మిషన్ యొక్క లక్ష్యాలను సమర్థవంతంగా అందించడానికి తగిన సంస్థాగత యంత్రాంగాల ద్వారా ఉంటుంది.

అంతేగాక ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు మరియు పౌర సమాజ చర్యలతో ముడిపడి ఉంటుంది.

వాతావరణ మార్పు, అనుసరణ మరియు ఉపశమనం, శక్తి సామర్థ్యం మరియు సహజ వనరుల పరిరక్షణపై అవగాహనను ప్రోత్సహించడంపై దృష్టి ఉంటుంది.

వాతావరణ మార్పులకు సంబందించి కీలక లక్ష్యాలను సాధించడానికి బహుముఖ, దీర్ఘకాలిక మరియు సమగ్ర వ్యూహాలను సూచించే జాతీయ కార్యాచరణ ప్రణాళికలో ఎనిమిది జాతీయ మిషన్లు ఉన్నాయి.

ఈ కార్యక్రమాలు చాలావరకు ఇప్పటికే ఆచరణలో ఉన్న చర్యలలో భాగమే అయినప్పటికీ, వాటి దిశలో మార్పు, పరిధి మరియు ప్రభావాన్ని మెరుగుపరచడం మరియు సమయానుకూల ప్రణాళికలను వేగవంతం చేయడం అవసరం.

Join us on Twitter

National Action Plan on Climate Change లో భాగంగా ప్రారంభించిన 8 జాతీయ మిషన్లు

1. జాతీయ సౌర మిషన్

2. మెరుగైన శక్తి సామర్థ్యానికి జాతీయ మిషన్

3. నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హాబిటాట్

4. నేషనల్ వాటర్ మిషన్

5. హిమాలయ పర్యావరణ వ్యవస్థను నిలబెట్టడానికి నేషనల్ మిషన్

6. గ్రీన్ ఇండియా కోసం నేషనల్ మిషన్

7. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్

8. వాతావరణ మార్పు కోసం వ్యూహాత్మక జ్ఞానంపై జాతీయ మిషన్

Subscribe on YouTube

మిషన్ల అమలు

ఈ జాతీయ మిషన్లు సంబంధిత మంత్రిత్వ శాఖలచే సంస్థాగతీకరించబడతాయి మరియు సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు ప్రణాళికా సంఘం(ప్రస్తుతం నీతీ ఆయోగ్), పరిశ్రమ, విద్యా మరియు పౌర సమాజానికి చెందిన నిపుణులతో పాటు అంతర్-రంగాల సమూహాల ద్వారా నిర్వహించబడతాయి.

మిషన్ పరిష్కరించాల్సిన పనిని బట్టి సంస్థాగత నిర్మాణం మారుతూ ఉంటుంది మరియు ఉత్తమ నిర్వహణ నమూనా అవలంబించే అవకాశాన్ని అందిస్తుంది.

NAPCC అమలుకు ప్రజల్లో అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. జాతీయ పోర్టల్స్, మీడియా ఎంగేజ్‌మెంట్, సివిల్ సొసైటీ ప్రమేయం, పాఠ్యాంశాల సంస్కరణ మరియు గుర్తింపు / అవార్డుల ద్వారా ఇది సాధించబడుతుంది.

ఈ ఎనిమిది జాతీయ మిషన్లు వాతావరణ మార్పులకు అనుగుణంగా దేశానికి సహాయపడటమే కాకుండా, ముఖ్యంగా, ఆర్థిక వ్యవస్థను క్రమంగా మరియు గణనీయంగా అభివృద్ధి మార్గంలో నడపడానికి సహాయపడతాయి.

Join us on instagram

One thought on “National Action Plan on Climate Change”

Comments are closed.