PM addresses India-Australia Circular Economy Hackathon (I-ACE)

PM addresses India-Australia Circular Economy Hackathon (I-ACE) భారత్-ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ హాకథాన్ (I-ACE) లో ప్రధాని మోది ప్రసంగించారు

భూమాతపై పర్యావరణ ఒత్తిడిని పరిష్కరించడంలో సర్కులర్ ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషించగలదు: ప్రధాని

COVID అనంతర ప్రపంచాన్ని రూపొందించడంలో బలమైన భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది: ప్రధాని

మన వినియోగ విధానాలను, పర్యావరణంపై వాటి ప్రభావాన్ని ఎలా తగ్గించవచ్చో పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ అన్నారు. ఈ విషయంలో మన సవాళ్లను పరిష్కరించడంలో సర్క్యులర్ ఎకానమీ కీలక పోషించనున్నట్లు ఆయన అన్నారు. ఈ రోజు ఇండియా-ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ హాకథాన్ యొక్క వాల్డిక్టరీ ఫంక్షన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు.

వస్తువులను రీసైక్లింగ్ చేయడం మరియు పునర్వినియోగం చేయడం, వ్యర్థాలను తొలగించడం మరియు వనరుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం మన జీవనశైలిలో భాగం కావాలని ప్రధాని అన్నారు. హ్యాకథాన్‌లో ప్రదర్శించిన ఆవిష్కరణలు సర్కులర్ ఎకానమి పరిష్కారాలలో ముందడుగు వేయడానికి ఇరు దేశాలను ప్రేరేపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆలోచనలను స్కేల్-అప్ చేయడానికి మరియు ముందుకు తీసుకువెళ్ళే మార్గాలను కనుగొనాలని ఆయన కోరారు. “మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, మదర్ ఎర్త్ అందించే అన్నింటికీ మనము యజమానులం కాదు, కేవలం రాబోయే తరాలందరికీ దాని ధర్మకర్తలు” అని ప్రధాని అన్నారు.

హ్యాకథాన్‌లో పాల్గొనే నేటి యువత శక్తి మరియు ఉత్సాహం రాబోయో కాలంలో భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య భాగస్వామ్యానికి కనిపించే ప్రతీక అని ప్రధాని అన్నారు. “కోవిడ్ అనంతర ప్రపంచాన్ని రూపొందించడంలో బలమైన భారతదేశం-ఆస్ట్రేలియా భాగస్వామ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మరియు మన యువత, మన యువ ఆవిష్కర్తలు, మన అంకురాలు ఈ భాగస్వామ్యంలో ముందంజలో ఉంటాయి” అని ప్రధాని ముగించారు.

ఈ సందర్భంగా ప్రధాని చేసిన పూర్తి ప్రసంగం యోక్క తెలుగు అనువాదం కింద చూడవచ్చు.


Join us on Facebook

మిత్రులారా,

గత ఏడాది జూన్‌లో, ప్రధాని మోరిసన్ మరియు నేను సర్క్యులర్ ఎకానమీపై హ్యాకథాన్ నిర్వహించే అవకాశం గురించి చర్చించాము.

మా ఆలోచన ఇంత త్వరగా నిజమౌతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.

ఈ ఉమ్మడి కార్యచరణకు సహకరించినందుకు నా ప్రియ మిత్రుడు, ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ కు కృతజ్ఞతలు.

COVID-19 మహమ్మారి ఉన్నప్పటికీ పాల్గొన్న వారందరి నిబద్ధతకు నేను అభినందిస్తున్నాను.

నా దృష్టిలో మీరు అందరూ విజేతలు.

మిత్రులారా,

ఇవ్వాళ వాతావరణ మార్పు వల్ల ఎదురయ్యే సవాళ్లను మానవాళి మొత్తం ఎదుర్కొంటున్నందున, ఈ హాకథాన్ యొక్క థీమ్ మొత్తం ప్రపంచానికి సంబంధించినది.

వినియోగ-ఆధారిత ఆర్థిక నమూనాలు మన గ్రహం మీద గొప్ప ఒత్తిడిని కలిగించాయి.

పుడమి తల్లి అందించే అన్నింటికీ మనము యజమానులం కాదని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, కేవలం రాబోయే తరాలందరికీ అందించే వారధులం మాత్రమే.

మన ఉత్పత్తి ప్రక్రియలను మరింత సమర్థవంతంగా మరియు తక్కువ కాలుష్య రహితంగా మార్చడం మాత్రమే సరిపోదు.

ఒకరు ఎంత వేగంగా లేదా నెమ్మదిగా ప్రయాణం చేసినా, ప్రయాణించే దిశ తప్పుగా ఉంటే, వారు చేరవలసిన గమ్యం ఎప్పటికీ చేరలేరు.

కాబట్టి, మనం సరైన దిశను నిర్దేశించుకోవాలి.

మన వినియోగ విధానాలను మనం గమనిస్తు పర్యావరణంపై వాటి ప్రభావాన్ని తగ్గించే విధంగా ముందుకు సాగాలి.

ఇక్కడే సర్క్యులర్ ఎకానమీ అనే భావన వస్తుంది.

ఇది మన అనేక సవాళ్లను పరిష్కరించడంలో కీలక దశ.

వస్తువులను రీసైక్లింగ్ చేయడం మరియు తిరిగి ఉపయోగించడం, వ్యర్థాలను తొలగించడం మరియు వనరుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం మన జీవనశైలిలో భాగం కావాలి.

ఈ హ్యాకథాన్ భారతీయ మరియు ఆస్ట్రేలియా విద్యార్థులు, అంకుర సంస్థలు మరియు వ్యవస్థాపకుల నుండి వినూత్న పరిష్కారాలను చూసింది.

ఈ ఆవిష్కరణలు సర్కులర్ ఆర్థిక వ్యవస్థ యొక్క తత్వశాస్త్రానికి మీ నిబద్ధతను చూపుతాయి.

మీ ఆవిష్కరణలు సర్కులర్ ఆర్థిక పరిష్కారాలలో ముందడుగు వేయడానికి మన రెండు దేశాలను ప్రేరేపిస్తాయనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు.

మరియు, దాని కోసం, మేము ఇప్పుడు ఈ ఆలోచనలను మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలను కూడా అన్వేషించాలి.

బడ్జెట్‌ విశేషాలు తెలుసా!!

 

మిత్రులారా,

యువత యొక్క శక్తి సామర్ధ్యాలు కొత్త ఆలోచనలకు పదును పెట్టండం మరియు ఆవిష్కరణలు మరియు రిస్క్ తీసుకునే సామర్థ్యాలను అర్ధం చేసుకోగల మనోవికాశంతో వస్తుంది.

నేటి ఈ వేడుకలో యువత శక్తి మరియు ఉత్సాహం రానున్న రోజుల్లో భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య భాగస్వామ్యానికి చిహ్నం.

మా యువత యొక్క శక్తి, సృజనాత్మకత మరియు భిన్న ఆలోచనాశక్తిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది.

మన యువత మన రెండు దేశాలకు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి స్థిరమైన, సంపూర్ణ పరిష్కారాలను అందించగలరు.

COVID అనంతర ప్రపంచాన్ని రూపొందించడంలో బలమైన భారతదేశం-ఆస్ట్రేలియా భాగస్వామ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

మరియు మన యువత, మన యువ ఆవిష్కర్తలు, మన అంకురాలు ఈ భాగస్వామ్యంలో ముందంజలో ఉంటాయి.

ధన్యవాదాలు!

మీకు చాలా కృతజ్ఞతలు!

One thought on “PM addresses India-Australia Circular Economy Hackathon (I-ACE)”

Comments are closed.