UltraViolet Disinfection Tower UV-Blaster developed by DRDO (తెలుగు అనువాదం)
UltraViolet Disinfection Tower (click here for English version) అనేది అతినీలలోత కిరణాల ఆధారంగా పనిచేసే క్రిమిసంహార పరికరం.
కరోనా మహమ్మారి వికటాట్టహాసం చేస్తున్న తరుణంలో దానిపై యుద్ధం కోసం తయారు చేసిన అశ్త్రమే ఈ అతినీలలోతి క్రిమిసంహార టవర్ (యంత్రం).
ఈ పరికరానికి UV-Blaster అని నామకరణం చేసారు.
ఢిల్లీలోని LASTEC లేసర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్(డి.ఆర్.డి.ఓ. కి చెందిన ఒక పరిశోధనా కేంద్రం)లో దీని రూపకల్పన జరిగింది.
దీని తయారీ New Age Instruments and Materials Pvt. Ltd. అనే ఒక ప్రైవేటు సంస్థ సహకారాన్ని అందించింది.
ప్రస్తుతం పారిశుధ్యానికి వాడుతున్న రసాయన సానిటేజర్లను మనం అన్ని సందర్భాలలో వాడలేము.
అధునాతన సాంకేతిక పరికరాలు ఉన్న చోట దీని ఉపయోగం చాలా ఉంటుంది.
రసాయన సానిటైజర్ల వాడకం కష్టమైనటువంటి కంప్యూటర్లు, మరియు ఇతర సాంకేతిక పరికరాలు ఉపయోగించే కర్మాగారాలు, కార్యాలయాలు వంటి అనేక ప్రాంతాల సుద్ధికి ఈ UltraViolet Disinfection Tower చక్కగా ఉపకరిస్తుంది.
చదవండి: May 2020 Important Days and Events
ఈ UV-Blaster జన సాంద్రం ఎక్కువగా ఉండే రద్దీగా ప్రదేశాలలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇలాంటి ఒక పరికరం యొక్క అవసం ఎంతైనా ఉంది.
రద్దీగా ఉండే ఎయిర్పోర్టులు, షాపింగు మాల్సు, ఫాక్టరీలు, హోటళ్ళు, కార్యాలయాలు ఇలా అన్ని ప్రదేశాలలో దీని ఉపయోగం ఉంటుంది.
ఈ UltraViolet Disinfection Tower తయారీలో 43 వాట్లతో పని చేసే 6 టైప్-సి అతినీలలోలిత కిరణాల బల్బులు అమర్చారు.
ఇది 360°ల్లో తన ప్రభావాన్ని చూపగలదు.
ఇవి సహజంగా సూర్యునిలో గల టైప్-సి అతినీలలోలిత కిరణాల వంటివే. ఈ కిరణాలు మానవునికి ప్రమాదకరమైనవి.
భూమి యొక్క ఓజోన్ పొర ఈ కిరణాల నుండి మనల్ని రక్షిస్తుంది. మానవ తప్పిదాల వల్ల ఈ ఓజోన్ పొరకు కూడా చిల్లులు పడిందని అనేక మంది పర్యావరణ వేత్తలు అనేక సార్లు ప్రస్తావించడం మనం చూస్తూనే ఉన్నాం.
ఈ టైప్-సి కిరణాలు ఇందులో వాడటం వల్ల దీని ఉపయోగంలో జగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
లాప్టాప్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా దీనిని రిమోట్ ఆపరేటింగ్ చేయవచ్చు.
అంతే గది తలుపులు తెరచినా లేదా ఏదైనూ మానవ కదలికలు ఇది పసికట్టినా దీనిలోని సాంకేత వల్ల ఇది దానంతట అదే ఆగిపోయేలా దీన్ని రూపొందించారు.
ఒక 12×12 అడుగుల (144 చదరపు అడుగులు) గదిని లేదా ప్రాంతాన్ని శుద్ధి చేయడానికి ఈ UV-Blasterకి 10 నిమిషాలు సరిపోతుంది.
400 చదరుప అడుగుల ప్రాంతాన్ని శుభ్రపరచడానికి 30 నిమిషాలు పడుతుంది.
టెలిగ్రాంలో మా అప్డేట్స్ పొందటానికి: https://t.me/onlineappsc