World Heritage Day

World-Heritage-Day

ప్రపంచ వారసత్వ దినోత్సవం

ప్రపంచంలో అనేక దేశాలు, ప్రతి దేశానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపునిచ్చే సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని శతాబ్దాల క్రితం వెల్లివిరిసిన తమ నాగరికతకు గుర్తుగా ఆనాటి ప్రజలు నివసించిన ప్రాంతాలు, ప్రభువులు నిర్మించిన అద్భుత కట్టడాలు ఒక తరం నుండి మరొక తరం వారికి చారిత్రక ప్రామిఖ్యతను తెలియ జేస్తూ తమ గొప్పతనాన్ని చాటుతున్నాయి.

అంతటి విశిష్టతను కలిగిఉన్న ఆ కాలం నాటి కట్టడాలను వారి యొక్క నాగరికతను సంస్కృతిని భవిషత్ తరాలకు అందిస్తూ వాటి పట్ల అవగాహనను కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది.

ప్రపంచంలో వారసత్వ సంపద పరిరక్షణ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఆయిన అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఆఫ్రికాలోని టునీశియా దేశంలో 1982 ఏప్రిల్ 18న సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రపంచంలోని అనేక దేశాలనుండి వచ్చిన ప్రతినిధుల వారసత్వ సంపద పరిరక్షణకు అనేక సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ సమావేశాన్ని నిర్వహించిన ఏప్రిల్ 18వ తేదీనే ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించాలని ఐరాస సభ్యదేశాలు UNESCO కు ప్రతిపాదనలు పంపించగా ఆ ప్రతిపాదనలకి 1983లో తన ఆమోదం తేలియజేస్తూ ఏప్రిల్ 18వ తేదిని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది దీనినే అంతర్జాతీయ స్వారక చిహ్నాలు మరియు చారిత్రక ప్రదేశాల దినోత్సవం (International Day for Monuments and Sites) అని కూడా అంటారు.

1983 నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1000 వరకు UNESCO గుర్తింపు పొందిన ప్రదేశాలు ఉండగా, భారత్ నుండి ఇప్పటి వరకు 39 ప్రాంతాలను UNESCO గుర్తింపు లభించింది.

1983లో మొట్టమొదటి సారి మన దేశంలోని ఆగ్రా కోట, అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, తాజ్ మహల్ లకు గుర్తింపు లభించగా, తాజాగా 2019వ సంవత్సరంలో The Pink City of India గా పిలువబడే జైపూర్ సిటిని UNESCO చారిత్రక నగరంగా గుర్తించింది.

రాజేశ్ బుర్ర