National Mission for Enhanced Energy Efficiency – మెరుగైన శక్తి సామర్థ్యానికై జాతీయ మిషన్:
National Action Plan on Climate Change లో భాగంగా ప్రారంభించిన 8 జాతీయ మిషన్లలో National Mission for Enhanced Energy Efficiency ఒకటి.
2001 ప్రభుత్వ శక్తి పరిరక్షణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) మరియు ప్రతి రాష్ట్రంలో నియమిత సంస్థాగత యంత్రాంగాల (ఏజెన్సీల) ద్వారా ఇంధన సామర్థ్య చర్యల అమలు చేపట్టాలి.
2012 లో 11 వ పంచవర్ష ప్రణాళిక ముగిసే సమయానికి 10,000 మెగావాట్ల ఆదా కోసం అనేక పథకాలు మరియు కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి.
చదవండి: National Water Mission – జాతీయ నీటి మిషన్
శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి, నాలుగు కొత్త కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి.
1) Perform Achieve and Trade (PAT):
అధికంగా ఇంధన వినోయగం జరిగే భారీ పరిశ్రమలు మరియు స్థాపనలలో సమర్ధవంత ఇంధన వినియోగానికై ఉద్దేశించిన పధకం PAT.
ఈ పధకం ద్వారా వార్షిక నిర్దేశిత ఇంధన వినియోగ లక్ష్యాలలో మిగులు కనబరచిన వ్వవస్థాపనలకు భారత ప్రభుత్వ శక్తి మంత్రిత్వ శాఖ ఇంధన పొదుపు ధృవీకరణ పత్రాలను(Energy Saving Certificates – ESCerts) అందజేస్తుంది.
ఈ ధృవీకరణ పత్రాలను ఆయా సంస్థలు నిర్దేశిత మార్కెట్లలో ఆ లక్ష్యాలను అందుకోలేక పోయిన సంస్థలకు విక్రయించవచ్చు.
సమర్ధ ఇంధన వినియోగ విధానాలు మరియు కొనుగోలు చేసిన ESCerts కలిపినా లక్ష్యాలను చేరుకోలేని సంస్థలకు జరిమానాలు సైతం నిర్దేశించడమైనది.
2) Market Transformation for Energy Efficiency (MTEE)
నియమిత రంగాలలో శక్తి సామర్థ్య పరికరాలకై వినూత్న ఉత్పత్తులను మరింత అందుబాటు ధరలలో అందజేయడానికి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ పధకం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ పధకం కింద 2 కార్యక్రమాలను రూపొందించారు.
a) Bachat Lamp Yojana (BLY):
ఈ కార్యక్రమాన్ని 2009లో ప్రారంభించారు. ఇందులో భాగంగా అప్పటివరకు వినియోగంలో ఉన్న ఇన్కాండసెంట్ బల్బుల స్థానంలో శక్తి వినియోగాన్ని గణనీయంగా తగ్గించే సి.ఎఫ్.ఎల్. బల్బులను ప్రోత్సహించారు.
ఇన్కాండసెంట్ బల్బుల ధరలకే CFL బల్బులను అందజేసారు.
ఈ కార్యక్రమాన్ని 2015లో Unnat Jeevan by Affordable LEDs for All (UJALA) గా మార్చి CFL స్థానంలో గృహవినియోగానికి LED దీపాలు అందించారు.
b) Super Efficient Equipment Program (SEEP):
ఈ కార్యక్రమం సమర్ధ శక్తి వినియోగ గృహోపకరణాల తయారీని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సమర్ధ శక్తి వినియోగ గృహోపకరణాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకాలు అందిస్తారు.
12 వ పంచవర్ష ప్రణాళికా కాలంలో గృహ రంగంలో అధిక ఇంధన వినియోగం జరిగే సీలింగ్ ఫాన్ల తయారిలో ఇంధన సామర్థ్యం పెంపొందించేందుకు BEE ఒక పధకాన్ని ప్రారంభించింది.
3) Energy Efficiency Financing Platform (EEFP):
ఇంధన పొదుపు రంగంలో నూతన ఆవిష్కరణలు మరియు స్థాపనలకు సులభ ఋణాలు లభించే విధంగా విత్త, ఆర్ధిక రంగ సంస్థలు, పెట్టుబడిదారులకు మరియు ఇంధన పొదుపు రంగం సంస్థల మధ్య గల అవరోధాలను అధిగమించేందుకు ఈ కార్యక్రమం రూపొందించారు.
చదవండి: Easing Liquidity at NBFCs and HFCs
4) Framework for Energy Efficient Economic Development (FEEED)
ఈ కార్యక్రమం బ్యాంకులు మరియు పెట్టుబడిదారులకు నష్ట భయాలను వినూత్న ఆర్థిక సాధనాల ద్వారా పరిష్కరిస్తుంది.
ఇందులో భాగంగా, ఇంధన సామర్థ్య ప్రాజెక్టులలో బ్యాంకులు మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కాపాడటానికి మరియు నిధుల కొరత కారణంగా ప్రాజెక్టులు నిలిచిపోకుండా ఉండటానికి BEE రెండు రకాల నిధులను సంస్థాగతీకరించింది.
Partial Risk Guarantee Fund for Energy Efficiency (PRGFEE) శక్తి సామర్థ్యానికి పాక్షిక రిస్క్ గ్యారంటీ నిధి:
ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల అమలు కోసం రుణాలు అందించే బ్యాంకులు మరియు పెట్టుబడిదారులకు మద్దతు ఇవ్వడానికి ఈ నిధి ఉద్దేశించబడింది.
రిస్క్ కవర్ కింద రుణ మొత్తంలో 50% లేదా ప్రతి ప్రాజెక్టుకు 10 కోట్ల రూపాయలు ఏది తక్కువైతే దానికి ఈ ఫండ్ హామీ ఇస్తుంది.
Venture Capital Fund for Energy Efficiency (VCFEE) వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెన్సీ:
ఈ నిధి ఇంధన సామర్థ్య రంగంలో ఈక్విటీ ఫైనాన్సింగ్‌ను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. తద్వారా చిన్న సంస్థలు మరియు ప్రాజెక్టులకు రుణాల కొరతను తగ్గిస్తుంది.
ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేయడానికి ఈ ఫండ్ చివరి సాధనంగా ఈక్విటీ మద్దతును అందిస్తుంది.
ఈ నిధి ద్వారా 2 కోట్ల రూపాయలు లేదా మొత్తం ఈక్విటీలో 15% ఏది తక్కువ ఐతే ఆ మొత్తాన్ని అందిస్తారు.
One thought on “National Mission for Enhanced Energy Efficiency”
Comments are closed.